బాహుబలి స్టార్ రానా దగ్గుబాటి వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.కాగా ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు రానాకు చాలా మంచి పేరును తీసుకొచ్చాయి.
దీంతో తన నెక్ట్స్ మూవీలపై ఫోకస్ పెట్టిన రానా, ప్రస్తుతం అరణ్య అనే సినిమాతో మనముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.
పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రానా ఓ డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తాడు.
కాగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించాలని చూస్తున్న హిరణ్యకశిప చిత్రం గురించి చాలా రోజులుగా ప్రేక్షకులు ఎదురుచూస్తు్న్నారు.ఈ సినిమాను రానాతో చేయడానికి గుణశేఖర్ ఎప్పుడో రెడీ అయ్యాడు.
అయితే పలు కారణాల వల్ల ఈ సినిమా ఇంకా వాయిదా పడుతూ వస్తోంది.ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు గుణశేఖర్, సురేష్ బాబులు రెడీ అయ్యాడు.
కాగా ఈ సినిమాకు తొలుత రూ.160 కోట్లుగా చిత్ర నిర్మాతలు నిర్మించుకున్నారు.కానీ ఈ సినిమా బడ్జెట్‌ను సురేష్ బాబు ఒకేసారి ఏకంగా రూ.100 కోట్ల లోపుకు తగ్గించారు.రానాపై అంతటి భారీ బడ్జెట్‌ను కేటాయించడం మంచిది కాదని ఆయన అభిప్రాయ పడ్డారు.దీంతో చిత్ర బడ్జెట్‌ను అమాంతం తగ్గించేశారు.ఇప్పుడు ఈ బడ్జెట్‌తో సినిమా ఎలా చేయాలా అంటూ గుణశేఖర్ తల పట్టుకున్నాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఏదేమైనా ఓ సినిమాకు భారీ బడ్జెట్ కేటాయించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలంటూ పలువురు హితవు పలుకుతున్నారు.