శోభన్‌బాబు హీరోగా నటించిన చిత్రం ఏవండీ ఆవిడ వచ్చింది.ఆ చిత్రంలో వానశ్రీ మరియు శారదలు నటించారు.
ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఆ సినిమాలో శోభన్ బాబు కొన్ని కారణాల వల్ల వానశ్రీ మరియు శారదలను వివాహం చేసుకుంటాడు.ఇద్దరి మద్య ఆయన నలిగి పోతూ ఉంటాడు.
వారంలో మూడు రోజులు ఒక భార్య వద్ద మరో మూడు రోజులు ఇంకో భార్య వద్ద ఉంటాడు.మిగిలిన ఆ ఒక్క రోజు తల్లిదండ్రుల వద్ద శోభన్ బాబు గడుపుతూ ఉంటాడు.
ఆ సినిమా మంచి హిట్ అయ్యింది.ఇప్పుడు అదే తరహా కథ జార్ఖండ్‌లో జరుగుతుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.జార్ఖండ్‌లోని రాంచీ పట్టణంకు చెందిన రాజేష్ అనే వ్యక్తి కొన్ని కారణాల వల్ల రెండు పెళ్లిలు చేసుకున్నాడు.రెండు పెళ్లిల విషయం కొంత కాలంకే బయట పడింది.దాంతో పెద్ద మనుషులు కూర్చుని మాట్లాడి రెండు పెళ్లిలు చేసుకున్నాడు కనుక ఎవరికి అన్యాయం చేయకుండా ఇద్దరిని చూసుకోవాల్సిందే అంటూ తీర్పును ఇచ్చారు.
దాంతో ఇద్దరు భార్యలను వేరు వేరుగా కాపురాలు పెట్టి చూసుకుంటూ ఉన్నాడు.అయితే పెద్ద భార్య పోలీసుల వద్దకు వెళ్లి నా భర్త నా వద్దకు రాకుండా ఎక్కువ రోజులు చిన్న భార్య వద్దే ఉంటున్నాడు అంటూ ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదు మళ్లీ పెద్ద మనుషుల వద్దకు వచ్చింది.పెద్ద మనుషులు రాజీ కుదిర్చేందుకు అద్బుతమైన ఉపాయం ఆలోచించారు.వారు ఏవండీ ఆవిడ వచ్చింది సినిమా చూశారో లేదంటే మరేంటో కాని ఆ సినిమాలో ఉన్నట్లుగానే సెట్ చేశారు.వారంలో మొదటి మూడు రోజులు పెద్ద భార్య వద్ద ఆ తర్వాత మూడు రోజులు చిన్న భార్య వద్ద గడపాలంటూ పెద్ద మనుషులు తీర్పు ఇచ్చారు.
మిగిలి ఉన్న ఒక్క రోజు అతడు ఇద్దరు భార్యలకు దూరంగా ఇష్టం అయిన చోట ఉండేలా తీర్పు ఇచ్చారు.ఆ ఒక్క రోజు ఏ భార్య వద్ద కూడా ఉండవద్దు అనేది పెద్ద మనుషుల తీర్పు.
ఈ తీర్పు చాలా వింతగా ఉంది కదా.అందుకే సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయ్యింది.