బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగి దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు.ఇటీవల కాలంలో సినిమాకు ఆమె దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
అడపాదడపా కొన్ని సెలెక్టివ్ పాత్రల్లో మాత్రమే ఆమె మనకు కనిపించారు.కాగా శనివారం నాడు ఆమె రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్ హైవేపై శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్ర గాయాలపాలయ్యారు.కోల్హాపూర్ టోల్‌ప్లాజాకు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పింది.
దీంతో అది వెళ్లి ఓ ట్రక్కును వేగంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికుల సహాయంతో ఆమెను వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది.అయితే ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయని, ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని తెలియడంతో సినీ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు.ఇక ప్రమాదం జరిగిన సమయంలో ఆమెతో పాటు కారులో ఆమె భర్త జావేద్ అక్తర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.