అందుకే ఎన్టీఆర్, బాలయ్యల మల్టీ స్టారర్ ఆగిపోయింది....

2016వ సంవత్సరంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టువంటి జనతా గ్యారేజ్ చిత్రం మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.అంతేకాక దర్శక నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

 Yentha Manchi Vadaura Balayya Ntr Kalyan Ram-TeluguStop.com

ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన అక్కినేని కోడలు సమంత, తమిళ విలక్షణ నటుడు మోహన్ లాల్, నిత్యామీనన్, సీనియర్ నటి దేవయాని వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించారు.

అయితే ఈ చిత్రంలో మొదటగా తమిళ విలక్షణ నటుడు నటించినటువంటి మోహన్ లాల్ పాత్రలో నందమూరి నటసింహం  బాలయ్య బాబుని నటింపజేయాలని  దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేశారు.కానీ అప్పటికే బాలయ్య బాబు తన ఇతర సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండటం వలన డేట్లు షెడ్యూల్ కుదరలేదు.

అంతేగాక  బాబాయి, అబ్బాయి కాంబినేషన్లో సినిమా అంటే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆలోచనతో బాలయ్య బాబుని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. కానీ ఈ నందమూరి హీరోల కాంబినేషన్ లో మల్టీ స్టారర్ వచ్చి ఉంటే బాక్సాఫీస్ మాత్రం షేక్ అయ్యేదని నందమూరి అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Telugu Balakrishna, Janatha Garage, Mohan Lal, Ntr Balakrishna, Ntr Latest, Ntr-

అయితే ఇప్పటికే నందమూరి కళ్యాణ్ రామ్ బాబాయ్ బాలయ్య బాబు, జూనియర్ ఎన్టీఆర్ లతో నటించడానికి తాను ఏమీ అభ్యంతరం లేదని అందుకు తగ్గ కథ దొరికితే ఖచ్చితంగా చేస్తానని ఇప్పటికే చెప్పేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube