ఈ 10 రైల్వే స్టేషన్ల పేర్లు చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు..! కొన్నైతే తిడుతున్నట్టే ఉన్నాయి.!

నిత్య జీవితంలో మనకు అప్పుడప్పుడు కొన్ని కొత్త వస్తువుల గురించి తెలుస్తుంటుంది.అలాంటి వస్తువుల పేర్లు కూడా ఒక్కోసారి మనకు గమ్మత్తుగా అనిపిస్తాయి.

 10 Funniest Name Of Indian Railway Station Names-TeluguStop.com

అలాగే కొందరి పేర్లు కూడా విచిత్రంగా ఉంటాయి.కొందరి పేర్లను, కొన్ని ఊరి పేర్లను చదివితే మనకు నవ్వు వస్తుంటుంది కూడా.

ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా ఇలాంటి కొన్ని ఫన్నీ ఊర్ల పేర్ల గురించే.నిజానికి అవి ఆయా ఊర్లకు చెందిన రైల్వే స్టేషన్ల పేర్లు.

చదివితే భలే వింతగా ఉంటాయి.నవ్వు తెప్పిస్తాయి.

మరింకెందుకాలస్యం.వాటిపై ఓ లుక్కేయండి.!

1.కాలా బక్రా

ఈ రైల్వే స్టేషన్‌ పంజాబ్‌లోని జలంధర్‌లో ఉంది.పేరు భలే ఫన్నీగా ఉంది కదా.

2.బిల్లీ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిల్లీ అనే పేరిట ఉన్న రైల్వే స్టేషన్‌ ఇది.మరి కుక్క పేరిట ఏ స్టేషన్‌ లేదా ? ఏది ఏమైనా ఈ పేరు భలే వింతగా ఉంది కదా.

3.సాలీ

రాజస్థాన్‌లో ఉందీ రైల్వే స్టేషన్‌.షాకింగ్‌.ఇలాంటి పేర్లు ఉన్న ఊర్లు కూడా ఉంటాయా ?

4.భైంసా

దీన్ని గురించి తెలుగు వారికి తెలిసే ఉంటుంది.ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది కదా.

5.బాప్‌

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఈ స్టేషన్‌ ఉంది.నిజంగా ఇది రైల్వే స్టేషన్లకు బాప్‌లాగే ఉందే.

6.లోండా జంక్షన్‌

కర్ణాటకలోని హుబ్లిలో ఈ పేరు గల రైల్వే స్టేషన్‌ ఉంది.వింటానికే అదోలా ఉంది కదా.

7.చించ్‌పోక్లి

మహారాష్ట్రలోని ముంబైకి సమీపంలో ఈ స్టేషన్‌ ఉంది.దీని అర్థమేంటో తెలియడం లేదే.

8.సింగపూర్‌ రోడ్‌

ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న రైల్వే స్టేషన్‌ ఇది.నిజంగా సింగపూర్‌ అనుకునేరు.

9.వెంకట నరసింహ రాజువారి పేట

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న ఈ రైల్వే స్టేషన్‌ పేరు నిజంగా అన్ని స్టేషన్లలోకెల్లా పెద్ద పేరు గల స్టేషన్‌ అయి ఉంటుంది.ఇతర రాష్ట్రాల వారు మాత్రం పక్కాగా దీన్ని పలకలేరు.

10.లొట్టె గొల్ల హల్లి

బెంగుళూరుకు సమీపంలో ఈ స్టేషన్‌ ఉంది.ఈ పేరుకు అర్థం కూడా వారే చెప్పాలి.

ఏది ఏమైనా ఈ పేర్లన్నీ భలే ఫన్నీగా ఉన్నాయి కదా.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube