ప్రస్తుతం ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లోనూ వాట్సాప్ ఉంటుంది.ఇది ఎంతలా అంటే మనిషి జీవితంలో భాగంగా మారిపోయింది.
దూరం బంధాలను దగ్గర చేస్తూ ప్రపంచం లో ఏ మూల నున్నవారితోనైన మాట్లాడుకోవడం సందేశాలు పంపుకోవడం వంటివి వాట్సాప్ లో చాలా సులభంగా చేయొచ్చు.అయితే తాజాగా వాట్సాప్ సంస్థ మైక్రోసాఫ్ట్ లుమియా విండోస్ ఫోన్లను వాడేవారికి షాక్ ఇచ్చింది.
ఈనెల 31వ తారీకు దాటిన తర్వాత విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఉన్న ఫోన్లలో ఇకపై వాట్సప్ పనిచేయడం టూ పిడుగు పేల్చింది.
ఎందుకనగా ప్రస్తుతం విండోస్ ఫోన్లు వినియోగదారులు తక్కువగా ఉపయోగిస్తున్నారని అందువలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సాప్ ప్రతినిధులు తెలిపారు.
అయితే ఈ చేదు వార్త ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగిస్తున్న వారికి కూడా వర్తిస్తుంది.ఎలాగంటే ఆండ్రాయిడ్ వర్షన్ 2.3.7 కంటే తక్కువ ఆపరేటింగ్ సిస్టం ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా వాట్సాప్ పనిచేయదు.
అయితే ప్రముఖ దిగ్గజం మొబైల్ ఫోన్ తయారీ సంస్థ ఐ ఫోన్ కూడా ఈ సమస్య తప్పడం లేదు.ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టం 8 కన్నా తక్కువ ఉన్న ఐఫోన్ లలో కూడా వాట్సాప్ పని చేయదు.కాబట్టి ఇ పైన తెలిపిన ఈ ఫోన్లలో మీ ఫోన్ ఉంటే మీ సమాచారాన్నంతా బ్యాకప్ తీసుకొని ఉంచుకోవడం మేలని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు…
.