అమెరికాలో అక్రమ వలసలు..భారీగా భారతీయుల అరెస్టులు...!!!

అమెరికాలో అక్రమ వలస దారుల అరెస్ట్ లు రోజు రోజుకి భారీగా నమోదు అవుతున్నాయి.ఇరత దేశాల నుంచీ తమ దేశంలోకి అక్రమంగా, అనధికారికంగా ప్రవేశించే వారిని ట్రంప్ నిలువరించాలని గత కొంతకాలంగా విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం విధితమే.

 Indians America Green Card-TeluguStop.com

అందుకుగాను అక్రమ వలసదారులు ఎక్కువగా వచ్చే మెక్సికో సరిహద్దు పొడవునా గోడని కట్టే పని కూడా వేగంగా జరుగుతోంది.అయితే

అమెరికా ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల వివరాలు ప్రకారం.

అక్రమ వలసదారుల సంఖ్య నానాటికి పెరుగుతోందట.అందులోనూ అక్రమ వలస భారతీయుల సంఖ్య ఏటేటా భారీగానే నమోదు అవుతోందని అంటున్నారు.2015 లో 3,532 గా ఉన్న ఈ సంఖ్య 2016 లో 3913కి పెరిగిందని అదే సంఖ్య 2017 లో 5322 మందికి చేరిందని ప్రకటించారు.

Telugu Green, Hb Visa, Indian America, Telugu Nri Ups-

ఇక 2018 లో అత్యధికంగా సుమారు 9811మంది అక్రమ వలస భారతీయులు పెరిగారని ఇమ్మిగ్రేషన్ అధికారికంగా ప్రకటించింది.ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఇలా అక్రమంగా వచ్చిన వారిలో అరెస్ట్ అయిన వాళ్ళు, శిక్ష పడిన వాళ్ళు అంటూ ఓ నివేదికని విడుదల చేసింది.అయితే ఇలా శిక్షలు పడిన వాళ్ళలో గర్భవతులు కూడా ఉన్నారని వారి అరెస్ట్ లు పోల్చుకుంటే గతంలో కంటే కూడా 2018 లో మరింత పెరిగాయని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube