ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు.ఈ సినిమాతో టాలీవుడ్ లో తన రేంజ్ చూపించుకోవాలని రామ్ ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం పట్టేయాలని స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నాడు.
ఈ సినిమాతో నిర్మాతగా చార్మీ కూడా సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని అనుకుంటుంది.ఇదిలా ఉంటే హైదరాబాదీ బ్యాగ్రౌండ్ లో నడిచే ఈ సినిమా షూటింగ్ మొత్తం పాతబస్తీ, చార్మీనార్ ఏరియాలో జరుగుతుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చార్మినార్ ప్రాంతంలో జరుగుతుంది.ఇదిలా ఉంటే చార్మినార్ ప్రాంతంలో బహిరంగ ప్రదేశాలలో సిగరెట్ కాల్చడం నిషేధం.అయితే ఆ విషయం తెలియని చిత్ర యూనిట్ షూటింగ్ లో భాగంగా రామ్ సిగరెట్ కాల్చే సన్నివేశాన్ని చిత్రీకరించారు.అయితే అది చూసిన పోలీసులు షూటింగ్ దగ్గరకి చేరుకొని బహిరంగ ప్రదేశాలలో సిగరెట్ తాగినందుకు రామ్ కి జరిమానా విధించారు.
అది కేవలం రెండు వందలే అయిన ఈ జరిమానా రామ్ నేరుగా కట్టాల్సి వచ్చింది.షూటింగ్ లో భాగంగా చేసిన కూడా తప్పు తప్పే కాబట్టి ఈ ఫైన్ ని అతను చెల్లించాడు.