పుల్వామా ఉగ్రదాడికిలో జావాన్ల మృతికి దేశ వ్యాప్తంగా సంతాపం తెలియజేసింది.దాంతో పాటు ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకి, ఉగ్రవాదులకి ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్ పై, ఓ వైపు ఇండియన్ గవర్నమెంట్ రక్షణా దళాలు ప్రతీకార చర్యలకి రెడీ అవుతున్నాయి.
భారత ప్రజలు కూడా పాకిస్తాన్ కి సరైన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు.మరో వైపు పుల్వామా లో జవాన్లపై ఉగ్రదాడికి కారణమైన కీలక సూత్రధారి, మాస్టర్ మైండ్ ఘాజీని ఇప్పటికే భద్రతా దళాలు ఎన్ కౌంటర్ లో హతం చేసారు.
ఇదిలా వుంటే ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై ఇండియన్ హ్యాకర్స్ సైబర్ దాడులకి తెగబడ్డారు.పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన సుమారు 200 వెబ్ సైట్స్ ని హ్యక్స్ చేసి ఇండియన్ స్లొగన్స్ వచ్చే విధంగా చేసారు.
దాంతో పాటు కొన్ని వెబ్ సైట్స్ ని కూడా క్రాష్ అయ్యేలా చేసారు.ఇండియాలో జవాన్లని హతం చేయడానికి ప్రతీకారంగానే ఈ సైబర్ దాడులకి పాల్పడినట్లు హ్యాకర్స్ కూడా నేరుగా చెప్పడం విశేషం.
ఇక ఇండియన్ హ్యాకర్స్ దాడికి గురైన పాకిస్తాన్ వెబ్ సైట్స్ ని పునరుద్ధరించుకునే పనిలో ఇప్పుడు అక్కడి ప్రభుత్వ సైబర్ నిపుణులు వున్నారు.