అమెరికాలో స్వామినారాయణ్‌ ఆలయంపై దాడి..!!!!

అమెరికాలో జాతివిధ్వేషం మరో సారి బయటపడింది.గుర్థూ తెలియని దుండగులు అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో ఉన్న ఓ హిందూ గుడిపై దాడి చేశారు.

 Americans Attacked On Swaminarayan Temple In America-TeluguStop.com

అక్కడ ఉన్న విగ్రహాలని ధ్వంసం చేశారు.గోడలని నల్ల రంగుతో నింపారు.

అక్కడ ఉన్న కుర్చీపై కత్తితో గుచ్చి వదిలి వెళ్ళిపోయారు.అక్కడ లూయిస్ విలేలో ఉన్న స్వామినారాయణ్ ఆలయంపై ఈ దాడి జరిగిందని తెలుస్తోంది.

ఈ సంఘటన ఒక్క సారిగా అక్కడ ఉన్న భారతీయులని ఆందోళనకి గురిచేసింది.ఈ దాడిని తీవ్రంగా ఖండించారు భారతీయులు.దాంతో అమెరికా అధికారులు దీనిపై విచారణ మొదలుపెట్టారు.ఈ దాడి జరగడం భాదాకరమని అన్నారు లూయిస్‌విలె మేయర్‌ గ్రెట్‌ ఫిషర్‌.ఈ రకమైన చర్యలు పిరికిపందలు చేస్తారు అంటూ భారతీయుల మనోభావాలని గౌరవించారు మేయర్ ఫిషర్.

ఇలాంటి చర్యలు జరగడం ఎంతో భాధాకరమని ఆ గుడికి చెందినా రాజ్ పటేల్ తన అభిప్రాయాన్ని తెలిపారు.అయితే అమెరికాలో ఇలాంటి సంఘటనలు జరగడం కొత్తకాదు.గతంలో అంటే 2015 ఏప్రిల్‌లో ఉత్తర టెక్సాస్‌లోని ఓ ఆలయాన్ని కూడా ఈ విధంగానే ధ్వంసం చేశారు.

అదే సంవత్సరం ఫిబ్రవరిలోనూ కెంట్‌, సీటెల్‌ మెట్రోపాలిటన్‌లో ఉన్న ఆలయాలపైనా దాడి జరిగింది.అయితే ఈ ఆలాయలపై దాడులు సమంజసం కాదని భారతీయ సంఘాలు అన్నీ ఖండిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube