సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే అనే విషయం మరోసారి నిరూపితం అయ్యింది.ఎన్నో సార్లు వివాదాస్పద సినిమాలు చేసిన వర్మ ఈసారి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే అత్యంత వివాదాస్పద సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.
తనకు ఎన్టీఆర్ గారు కలలో కనిపించి స్క్రిప్ట్ వర్క్‌లో సాయం చేశాడంటూ ప్రకటించిన వర్మ తాజాగా విడుదల విషయంలో కూడా ఆయన అనుమతి కోసం, ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల విషయంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌పై వర్మ స్పందించాడు.
బాలకృష్ణ, క్రిష్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రం విడుదల తేదీ ప్రకటించిన 24 నిమిషాల్లో నేను ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేస్తానంటూ ప్రకటించాడు.ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాకు పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపస్తుంది.తాజాగా వర్మ చేసిన ప్రకటన చూస్తుంటే అందుకోసమే ఆపుతున్నట్లుగా కూడా అనిపిస్తుంది.మరీ బాలకృష్ణను వర్మ ఎందుకు ఇంతలా టార్గెట్ చేశాడో అంటూ కొందరు నందమూరి అభిమానులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాలకృష్ణ ఇప్పటికే కథానాయకుడు సినిమాతో నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.ఇక మహానాయకుడు సినిమాకు వర్మ తన సినిమాను పోటీగా వదిలితే మాత్రం ఖచ్చితంగా మహానాయకుడు సినిమాకు మినిమం కలెక్షన్స్ కూడా రావు అంటూ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.ఎందుకంటే మహానాయకుడు కంటే కూడా అధికంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.మహానాయకుడు చిత్రానికి పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేయాల్సిందిగా స్వర్గం నుండి ఎన్టీఆర్ గారు నన్ను ఆదేశించారు.
ఒకవేళ అలా చేయకుంటే ఆయన సీరియస్ అవుతారేమో అంటూ వర్మ ఫన్నీ కామెంట్స్ చేశాడు.