రాబోయే ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చావో రేవో అనే పరిస్థితి.సుదీర్ఘకాలంగా ప్రతిపక్షంలో ఉన్న వైసిపి ఇప్పుడు కనుక అధికారం దక్కించుకో కపోతే… ఇక మనుగడే కష్టమయ్యే పరిస్థితి.
అందుకే ఆ పార్టీ అధినేత జగన్ చాలా కష్టపడుతున్నారు.పార్టీ విజయం కోసం అనేక ఎత్తుగడలు వేస్తూ… వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
ఏ కారణమో తెలియదు గాని ఏపీలో అయితే జగన్ గాలి బాగానే వీచినట్టు కనిపించింది చంద్రబాబుకు అందిన ఇంటిలిజెన్స్ రిపోర్ట్, అనేక సంస్థలు చేపట్టిన వివిధ సర్వేలు… జగన్ అంతర్గతంగా చేయించిన సర్వేలో ను ఒకే రకమైన రిజల్ట్ కనిపించింది.ఈ లెక్కన చూస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవడం కానీ అన్నట్టుగా తేలిపోయింది.
అయితే ఇన్నిరకాల రిపోర్ట్స్ తమకు అనుకూలంగా వచ్చినా… జగన్ లో మాత్రం ఇంకా గత అనుభవాల తాలూకా జ్ఞాపకాలు మాత్రం పోలేదు.
అసలు జగన్ పార్టీకి గత ఎన్నికల్లోనూ ఇదే రకమైన ఊపు కనిపించింది.అయితే.అప్పట్లో జగన్ చేసిన కొన్ని పొరపాట్లు, పోల్ మేనేజ్ మెంట్ అనుభవం లేకపోవడం, పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఇలా అనేక కారణాలతో ఆయన ఓటమి పాలయ్యారు.
ముఖ్యంగా జగన్ ఓటమికి అభ్యర్థుల ఎంపిక సరిగ్గా జరగకపోవడం కూడా ప్రధాన కారణమని రాజకీయ పండితులు ఎప్పుడో తేల్చేశారు.దీంతో ఈ విషయంలో జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నాడు.
గత ఎన్నికల సమయంలో విజయంపై ధీమాగా ఉన్న జగన్.అభ్యర్థుల ఎంపికపై పెద్దగా ద్రుష్టి పెట్టలేదు.
స్థానికంగా బలం లేని వారికి కూడా కొందరికి టిక్కెట్లు ఇచ్చారు.ఇక, వారు ఎంతవరకు పార్టీకి విశ్వాసంగా ఉంటారనేది కూడా చూసుకోలేదు.
జగన్ బంధువులు, సన్నిహితులు టిక్కెట్ల కేటాయింపులో కీలక పాత్ర పోషించారు.కొన్ని నియోజకవర్గాల్లో జగన్ మొహమాటానికి వెళ్లి ఆయన బంధువులు, సన్నిహితులు చెప్పిన వారికి టిక్కెట్లు ఇచ్చారు.
దీంతో పార్టీ విజయావకాశాలను అవి బాగా దెబ్బతీశాయి.
అందుకే ఈ సరి ఎన్నికల్లో ఆ సీన్ రిపీట్ అవ్వకుండా జగన్ జాగ్రత్త పడుతున్నాడు.
చాలా ముందుచూపుతోనే పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే ఏ నియోజకవర్గంలో ఏంటి పరిస్థితి .? ఇక్కడ ఎవరికి టికెట్ ఇస్తే గెలుపుగుర్రం అవుతారు…? అనే లెక్కలన్నిటిని జగన్ పక్కాగా తెలుసుకున్నారు.అందుకే టికెట్ల కేటాయింపుపై ఒక అంచనాకు వచ్చారు.బలంగా లేని నియోజకవర్గాల్లో బలమైన నాయకులను కూడా ఎంపిక చేసుకుని పార్టీలో చేర్చుకుని వారిని సమన్వయకర్తలుగా నియమించారు.
ఈ సమయంలో పార్టీని నమ్ముకున్న వారికి జగన్ అన్యాయం చేస్తున్నారనే విమర్శలు వచ్చినా జగన్ పట్టించుకోలేదు.తనకు కావాల్సింది గెలుపు మాత్రమే అనే బాణిలోకి జగన్ వెళ్లిపోయారు.అందుకే ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అవసరం అయితే ఒకటికి రెండు సార్లు సర్వేలు చేయించి గెలుపు పక్కా అనుకున్నవారికే టికెట్లు ఇచ్చేలా జగన్ ముందుకు వెళ్తున్నాడు.