రాజకీయాలందు ఏపీ రాజకీయాలు వేరయా అన్నట్టు ఇప్పుడు ఇక్కడ రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఒక పార్టీ వేసే ఎత్తులను చిత్తూ చేస్తూ… ఎత్తుకు పై ఎత్తులు వేసేలా రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు తమ రాజకీయ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు.
అలా ఉండకపోతే… ప్రస్తుత రాజకీయాల్లో ఉనికి నిలుపుకోవడం కష్టం.ఇంకా సాధారణ ఎన్నికలకు నాలుగు మాసాలే గడువు ఉండడంతో నాయకులు ఎవరికి వారే తమ బలాన్ని నిరూపించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ విషయంలో అన్ని పార్టీలు… ఇదే దూకుడుతో ముందుకు వెళ్తున్నాయి.అంతే కాకుండా ఇదే నెలలో బీజేపీ , టీడీపీ పార్టీలు అభ్యర్థుల లిస్ట్ ప్రకటించేందుకు కూడా సిద్ధం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పడు అందరి దృష్టి వైసీపీ అధినేత జగన్ మీదే పడింది.
ఎనిమిదేళ్లుగా అధికార పక్షానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వైసీపీ ఈ ఎన్నికల్లో అయినా… అధికారాన్ని దక్కించుకోకపోతే ఆ పార్టీ మనుగడే ప్రశ్నర్ధకం అవుతుంది.ఈ విషయంలో జగన్ కి కూడా బాగా క్లారిటీ ఉంది.అందుకే ….
జగన్ అనుసరించే వ్యూహంపైనే ఇప్పుడు అందరి కళ్లూ ఉన్నారు.నాయకులు ఎవరు ఎలాంటి వ్యూహంతో వెళ్తున్నారనేది ప్రధానమే అయినా జగన్ వంటి బలమైన ప్రతిపక్షం ఉన్న ఏపీలో ఆయన వేసే అడుగులకు కూడా బాగా ప్రభావం చూపిస్తాయి.
మొండివాడిగా పేరుపొందిన జగన్ ఒకవైపు అధికార పార్టీపై విమర్శలు చేస్తూనే.మరొపక్క, వచ్చే ఎన్నికల్లో పొత్తుతో వెళ్లాలా? లేక ఒంటరి పోరు చాలా? అనే విషయంపై క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నాడు.తొందరపడి ఏదో ఒక స్టెప్ తీసుకుంటే ఆ తరువాత రాజకీయంగా … ఇబ్బందులు ఎదుర్కోవాలని జగన్ భావిస్తున్నాడు.
ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు విచిత్రంగా మారిపోయాయి.అధికార పార్టీ టీడీపీ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితి ఉంది.జనసేన పార్టీ పరిస్థితి కూడా దాదాపు ఇంతే.
ఈ నేపథ్యంలో జగన్.తన బలాబలాలను అంచనా వేసుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.
అదే సమయంలో గత ఎన్నికల అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం జగన్ కు అత్యంత అవస రం.ఇప్పుడు ఏపీలో టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ మినహా మారే పార్టీ ముందుకు వచ్చేందుకు సిద్ధంగా లేదు.ఈ నేపథ్యంలో అందివచ్చిన అవకాశాలను తనకు అనుకూలంగా మార్చుకుని జగన్ ముందడుగు వేస్తే అధికార పీఠం దక్కించుకునే అవకాశం ఏర్పడుతుంది.