ఆ సర్వే లెక్కలు నిజమైతే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారా.. అక్కడ వైసీపీదే విజయమా?

2019 ఎన్నికల సమయంలో కుప్పంలో చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu )కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.కుప్పంలో వైసీపీ ప్రయత్నిస్తే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

 One More Huge Shock To Chandrababu Naidu Details Here Goes Viral In Social Medi-TeluguStop.com

అయితే గత కొన్నేళ్లుగా కుప్పం నియోజకవర్గం విషయంలో వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టగా ఈ ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉందని చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని ఒక సర్వే వెల్లడించింది. రేస్ సర్వే ఫలితాలలో( RACE Survey Results ) కుప్పంలో టీడీపీ( TDP ) ఓటమి అని వెల్లడి కావడంతో చంద్రబాబు కుప్పంపై దృష్టి పెడితే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కుప్పం( Kuppam ) ఒకప్పుడు టీడీపీకి కంచుకోట అయినా లెక్కలు మారుతున్నాయని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నగరిలో మాత్రమే టీడీపీ గెలుస్తుందని ఈ సర్వే ఫలితాలలో వెల్లడవుతూ ఉండటం గమనార్హం.

Telugu Ap, Chandrababu, Janasena-Politics

టీడీపీకి అనుకూలంగా ఉండే ఒక పత్రికలో సైతం ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేమని ప్రచారం జరుగుతోందంటే ఏపీలో ఎన్నికల ఫలితాలు( AP Elections Results ) ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయో అర్థమవుతోంది.11 సర్వేలలో కూటమికి అనుకూల ఫలితాలు వచ్చాయని చెబుతున్న చంద్రబాబు మిగతా సర్వేలలో మాత్రం కూటమికి అనుకూలంగా ఎందుకు ఫలితాలు రాలేదో చెబితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Ap, Chandrababu, Janasena-Politics

చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా ఉన్న సర్వేలను మాత్రమే ప్రస్తావిస్తే ప్రయోజనం ఏంటని కామెంట్లు వినిపిస్తున్నాయి.అన్ని సర్వేలను ప్రస్తావించి ఉంటే కూటమి అసలు పవర్ ఏంటో తేలే అవకాశం ఉండేది.చంద్రబాబు ఎన్నికల్లో గెలుపు కోసం సర్వేలను సైతం వదలడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.చంద్రబాబు నాయుడు గతంలో అమలు చేసిన వ్యూహాలను ఇప్పుడు అమలు చేసి గెలవాలని ప్రయత్నిస్తే వృథా ప్రయత్నమే అవుతుందని నెటిజన్లు చెబుతున్నారు.

రాబోయే రోజుల్లో చంద్రబాబుకు మరిన్ని షాకులు తప్పవని తెలుస్తోంది.చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిచినా మెజార్టీ ఎక్కువగా ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube