ఇది ఓ యువతి తన రైలు ప్రయాణంలో జరిగిన సంఘటన గురించి చెప్తూ పంపిన మెసేజ్.! ఏమైందో తెలుసా.?

మా అంకుల్ కు ఆరోగ్యం బాగాలేకపోవడంతో….మా పేరెంట్స్ ఆయనను చూడడానికి బీహార్ వెళ్లారు.

వెళ్లిన రెండు రోజులకు అక్కడి నుండి మా అమ్మ ఫోన్ చేసి, మామయ్య చనిపోయారు నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేయ్ అని చెప్పింది.అప్పటికప్పుడు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను….

సీట్ ఇంకా కన్ఫామ్ కాలేదు, వెయింటింగ్ లిస్ట్ లో ఉంది.అయినా సరే వెళ్లక తప్పదు కనుక…ట్రైన్ ఎక్కేశాను.

ఏదైనా సీట్ ఖాళీగా ఉంటే కూర్చుందాం అనుకున్నా.కానీ అంతా ఫిల్ అయ్యి ఉంది.

అప్పటికే సమయం సాయంత్రం 7 అవుతుంది.ఇక చేసేదేం లేక…ట్రైన్ డోర్ దగ్గర నిలబడి ఉన్న…అంతలోనే ఒకతను వచ్చి….

మేడమ్ మీకు సీట్ కావాలా? అని అడిగాడు.

హా…అవును అన్నాను.ఇది నా బెర్త్ యే…సో మీరు పడుకోండి నేను డోర్ దగ్గర కూర్చుంటాను అన్నాడు.అలా కాదు అంటూ ఫైనల్ గా ఓ నిర్ణయానికి వచ్చాము ఉన్న ఒక బెర్త్ లో పడుకోకుండా…ఇద్దరం కూర్చుందామని.

అతనూ ఒకే అన్నాడు రాత్రంతా…అతను అటువైపు, నేను ఇటువైపు చైర్ లో కూర్చొని మాట్లాడుకుంటూ గడిపాము.అతను అమెరికాలో జాబ్ చేస్తాడని, 4 రోజులు సెలవు పెట్టి సొంతూరుకు వస్తున్నట్టు చెప్పాడు.

ఆ మాటల్లోనే ఒకరి ఫోన్ నెంబర్లు ఒకరం తీసుకున్నాం.ఉదయం నేను దిగే స్టేషన్ రావడంతో అతనికి భై చెప్పి రైలు దిగాను.

కట్ చేస్తే….సరిగ్గా సంవత్సరం తర్వాత అతడితోనే నా పెళ్లి జరిగింది.మా వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది.మా అన్యోన్యతకు గుర్తుగా ఇప్పుడు మాకు ఓ బాబు.

ఇప్పుడు మా ఆయన అమెరికా జాబ్ కు రిజైన్ చేసి…ఇక్కడే అంతకంటే మంచి జాబ్ లో జాయిన్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube