క్షణం ఫేమ్ అడవి శేష్ నటించిన గూఢచారి హిట్టా.? స్టోరీ, రివ్యూ.. రేటింగ్ తెలుగులో...!

Movie Title : గూఢచారి

Cast & Crew:
నటీనటులు: అడివి శేష్, శోభిత దూళిపాళ్ల తదితరులు
దర్శకుడు: శశి కిరణ్ తిక్క
నిర్మాత: అభిషేక్ పిక్చర్స్
సంగీతం: శ్రీచరణ్ పాకాల

 Adivi Sesh Goodachari Movie Review And Rating-TeluguStop.com

STORY:

1995 లో దేశం కోసం మరణించిన “గోపి (అడివి శేష్)” తండ్రిని చూపిస్తూ ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.అప్పటినుండి గోపి అలియాస్ అర్జున్ కూడా ఆర్మీలో చేరాలి అనుకుంటాడు.

ఎన్నో ప్రయత్నాలు చేసాడు కానీ ఫెయిల్ అయ్యాడు.చివరికి భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న “త్రినేత్ర” అనే సీక్రెట్ ఏజెన్సీ గోపికి ఉద్యోగం ఇస్తుంది.

ఇంతలో అసోసియేషన్ లో కొన్ని అవకతవకలు జరుగుతాయి.ఇంటర్వెల్ సీన్ దగ్గర విలన్ ను రివీల్ చేస్తారు.

దుండగులను పట్టుకునే ప్రయత్నంలో ఉంటాడు గోపి.ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో చిట్టగాంగ్ కి వెళ్తాడు గోపి.

అక్కడ తన లైఫ్ కి సంబందించిన ఒక ట్విస్ట్ ఎదురవుతుంది.క్లైమాక్స్ లో వచ్చే ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే!

REVIEW:

క్షణం’ వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం ‘గూఢచారి’.సొంతంగా రాసుకున్న కథతో ఈసారి పాజిటివ్ బజ్‌తో థియేటర్స్ వస్తున్నాడు అడవి శేష్.ఒక సాధారణ కాలేజ్ స్టూడెంట్ గూఢచారిగా మారితే ఎలా ఉంటుంది అన్న జెన్యూన్ కాన్సెప్ట్‌ను థ్రిల్లింగ్‌గా తెరకెక్కించారు దర్శకుడు శశి కిరణ్ తిక్కా.

ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ్ల హీరోయిన్‌గా నటించింది.టేకింగ్, మేకింగ్ పరంగా హాలీవుడ్ చిత్రాలకి ధీటుగా హైటెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రంపై తొలి నుండి భారీ అంచనాలే ఉన్నాయి.

దీనికి తోడు జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సుప్రియ, రవిప్రకాష్ లాంటి పవర్ క్యాస్టింగ్ ఉండటంతో బిజినెస్ పరంగా ఈ చిత్రానికి అన్ని ఏరియాలనుండి భారీ ఆఫర్స్ వచ్చాయి.అడవి శేష్ తన పాత్రకు తగిన న్యాయం చేసాడు.

ఎమోషనల్ గా సాగిన క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్.జై హింద్ అనడంతో ఈ సినిమా ఎండ్ అవుతుంది.సంగీతం కూడా బాగుంది.

PLUS POINTS:

అడవి శేష్
స్టోరీ
జగపతి బాబు, ప్రకాష్ రాజ్
సంగీతం
స్క్రీన్ ప్లే
క్లైమాక్స్
ట్విస్ట్

MINUS POINTS:

కథలో కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు ఉన్నప్పటికీ టేకింగ్ బాగుంది

FINAL VERDICT:

ఒక సాధారణ కాలేజ్ స్టూడెంట్ గూఢచారిగా మారితే ఎలా ఉంటుంది అనేదే “గూఢచారి” సినిమా.స్పై థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి తప్పక్క నచ్చుతుంది

Rating: 3.5 /5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube