వేడి వేడి మొక్కజొన్నపొత్తు… ఉహించుకుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా .వర్షం పడుతున్న సమయంలో తింటుంటే ఆ మజానే వేరు.
దీని రుచికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.అంతటి గమ్మత్తు దీని ప్రత్యేకత.
అంతే కాదండోయ్ దీనిలో చాలా పోషకాలు దాగి,ఉన్నాయి.వీటిగురించి కుడా తెలుసుకుంటే ఇంక మొక్కజొన్న పొత్తులు ఎక్కడ కనపడినా వాటిని కొనకుండా ఉండరు అంత స్పెషాలిటి ఇందులో దాగి ఉంది
మొక్కజొన్నలో శరీరానికి అవసరమైన ఎ,బి,సి,ఇ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.
వీటిని ఉడికించి తిన్నా కాల్చి తిన్నా ఈ పోషకాలు అలాగే ఉంటాయి.గర్భిణీ లకు అవసరమైన పోలేట్ శాతం మొక్క జొన్నలో ఎక్కువగా లభిస్తుంది.
అంతేకాక మొక్క జొన్న తినడం వల్ల అందులోని విటమిన్స్ జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడంతో పాటు మలబద్దకాన్ని నివారించే టానిక్ లా పనిచేస్తుంది
ఇటీవల షుగర్ వ్యాధి గ్రస్తులు ఎక్కువగా మొక్క జొన్న పొత్తులు తినేందుకు మొగ్గుచూపుతున్నారు.ఆల్జీమర్స్, బీపి, గుండె సంభందిత రోగాలకు కొంత ఉపసమనంగా ఇది ఉపయోగపడుతోంది.
గ తంలో పోల్చుకుంటే ప్రతీ చోటా మొక్కజొన్న అమ్మే దుకాణాలు చాలా ఎక్కువగా వెలుస్తున్నాయి.కారణం దీని యొక్క ఉపయోగాలు ప్రజలకి ఎక్కువగా తెలియడం వల్లే అనడంలో సందేహం లేదు.
అంతేకాక మొక్కజొన్న లోని ఐరన్ రక్త హీనతని తగ్గిస్తుంది,మెగ్నీషియం గుండెకు, ఎముకులకు మంచి బలాన్ని ఇస్తుంది.