ఇలా వచ్చి అలా స్టార్ అయిపోయింది మళయాళ ముద్దుగుమ్మ కీర్తిసురేష్ .నేను శైలజాతో భారి హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ భామ, తమిళ స్టార్ హీరో విజయ్ సరసన ఛాన్స్ కొట్టేసింది.
అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు – ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో మొదలవనున్న భారి చిత్రంలో కూడా ఈ అమ్మాయే కథానాయిక అని అన్నారు కాని, అది కాస్త చేజారిపోయింది.
ఎవరిని ఫిక్స్ చేసుకుంటారో తెలియదు కాని, బాలివుడ్ భామే ఉండబోతోంది అని అంటున్నారు సూపర్ స్టార్ సినిమాలో.
మహేష్ మిస్ అయిపొయాడు కాని, మరో భారి అవకాశం, కీర్తి తలుపు తట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆ చిత్రం పుర్తవగానే వక్కంతం వంశీ డైరెక్షన్లో ఓ సినిమా చేయడం దాదాపు ఖాయం.
ఈ చిత్రం కోసం కీర్తిని హీరోయిన్ గా అనుకుంటున్నారట.మరి చివరి క్షణం దాకా కీర్తినే యంగ్ టైగర్ కి జోడిగా అనుకుంటారో, లేక మహేష్ జారిపోయినట్టే ఎన్టీఆర్ కూడా చేతిలోంచి జారిపోతాడో చూడాలి.