పదహారేళ్ళ వయసొస్తే చాలు, చాలామంది టీనెజర్స్ ఎదుర్కొనే కామన్ ప్రాబ్లమ్ మొటిమలు.ఈ మొటిమల సమస్య పోగొట్టుకోవడానికి వేల రూపాయలు ఖర్చుపెట్టి రకరకాల క్రీమ్ ప్రాడక్ట్స్ వాడేస్తుంటారు.
కాని చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, పది రూపాయలు ఖర్చుపెట్టి కూడా, వచ్చిన మొటిమని వచ్చినట్టే పంపించేయవచ్చు.ఎలాగో తెలుసుకోవాలంటే విషయాన్ని పూర్తిగా చదవండి.
పక్కింటి అక్కో, అన్నో మొటిమపై టూత్ పేస్ట్ పెట్టండి అదే తగ్గిపోతుంది అనే చిట్కా టీనేజర్స్ ఖచ్చితంగా చెప్పే ఉంటారు.ఇదంతా ఉత్తుత్తదే అని పట్టించుకోరు మన టీనేజర్స్.
కాని టూత్ పేస్ట్ వలన మొటిమను చంపేయవచ్చు అనేది నిజంగానే నిజం.
చాలా టూత్ పేస్టుల్లో “ట్రైక్లోసన్” అనే యాంటి బ్యాక్టీరియాను వాడతారు.
ఇది క్రీములని చంపుతుంది.అందుకే టూత్ పేస్ట్ ని మొటిమల్ని చంపే మంచి సాధనంగా చెబుతారు.
అయితే ఏ టూత్ పేస్ట్ పడితే ఆ టూత్ పేస్ట్ మాత్రం వాడకూడదు.ప్రతి చర్మం ఒకేలాగా ఉండదుగా.
ఎందుకైనా మంచిది డాక్టర్ ని సంప్రదించి, ఏ టూత్ పేస్ట్ అయితే మన చర్మానికి హాని కలిగించదో కనుక్కోని మరి ఉపయోగించాలి.