కామంతో కళ్లుమూసుకుపోయిన కామాంధులు రోజురోజుకు బరితెగించి ప్రవర్తిస్తున్నారు.ఎన్ని చట్టాలు వచ్చినా.
ఎన్ని కఠన శిక్షలు అమలు చేస్తున్నా.వీరిలో మార్పు మాత్రం రావడం లేదు.
ఆడది కనిపిస్తే చాలు.కామాంధులు మృగాల కన్నా దారుణంగా రెచ్చిపోతున్నారు.
ముక్కు పచ్చలారని పసిబిడ్డల దగ్గర నుంచి కాటికి కాలు చాపిన వృద్ధురాలి వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు.తాజాగా ఓ నీచుడు తొంబై ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.చావ్లాలోని నజఫ్‌గర్ ప్రాంతంలో 90 ఏళ్ల వృద్ధురాలు నివసిస్తోంది.అయితే ఎప్పటిలాగానే పాలు పోసే వ్యక్తి కోసం సాయంత్రం ఇంటి ముందు నిలబడి చూస్తోంది.
ఇంతలో 33 ఏళ్ల సోనూ అనే వ్యక్తి వచ్చి.ఈ రోజు పాలు పోసే వ్యక్తి రావడం లేదు.
పాలు దొరికే చోటుకు తీసుకెళ్తానని మాయమాటలు చెప్పాడు.
అది విని గుడ్డిగా నమ్మిన వృద్ధురాలు అతడితో వెళ్లగా.
మార్గంమధ్యలో సోనూ వృద్ధురాలని పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.సదరు వృద్ధురాలు వదిలేయమని ఎంత బతిమాలినా వినకపోవడంతో.ప్రతిఘటించింది.అయినా సోనూ ఆమెను కొట్టి మరీ లైంగికంగా దాడి చేశాడు.అయితే చివరకు అటు వెళ్తున్న స్థానికులు వృద్ధురాలి కేకలు వినిపించి అటుగా వెళ్లగా.సోనూ చేసే దారుణాన్ని చూసి షాక్ అయ్యారు.
దీంతో వెంటనే సోనూను చితకబాది పోలీసులకు అప్పగించారు.అలాగే మరోవైపు భయంతో వణికిపోతున్న వృద్ధురాలిని స్థానిక హాస్పటల్‌కు తరలించి.ఆమె కుమారికి సమాచారం అందించారు.ప్రస్తుతం వృద్ధారిలికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఇక నింధితులు సోనూ రేవ్లా ఖాన్‌పూర్ గ్రామానికి చెందిన వాడని పోలీసులు గుర్తించారు.ఈ క్రమంలోనే అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.