ట్రంప్‌ తో రేణు దేశాయ్, కూతురు ఆద్యా ఫోటో లకు ఫోజ్...! అసలు విషయం ఏమిటంటే...!?

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, వారి కూతురు ఆద్యా లు ట్రంపు తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ నవ్వును తెప్పిస్తున్నాయి.అసలు ట్రంప్ ఏంటి…? విరిద్దరూ ఫోటోలు దిగడం ఏంటి…? అని కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా…! ఇక అసలు విషయంలోకి వెళితే… తాజాగా రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ ను చేసింది.ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మార్గాల్లో తెగ వైరల్ గా మారింది.

 Renu Desai And Daughter Aadya Pose For Photos With Trump The Real Thing Is Trum-TeluguStop.com

ఇక రేణుదేశాయ్ పెంచుకుంటున్న పెంపుడు కుక్క పేరు ట్రంప్ అంట.అయితే పెంపుడు కుక్క పిల్ల పేరుకు అది చేసే పనులకు ఎటువంటి పోలిక లేదని ఆ కుక్క చాలా మంచిదని రేణు దేశాయ్ ఫోటోకు ఫోజు ఇచ్చింది.ఆ తర్వాత ఆ కుక్క పిల్ల తో తన కూతురు ఆద్యా కూడా ఫోటోకు ఫోజు ఇచ్చిన ఫోటోను రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.

ఆ కుక్క పిల్ల పేరు… అమెరికా అధ్యక్షుని పేరు కావడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ గా మారాయి.

ఇకపోతే పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ విడిపోయాక పవన్ కళ్యాణ్ కూతురు, కొడుకు అలాగే రేణుదేశాయ్ అందరూ పుణేలో నివాసం ఉంటున్నారు.

పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.రేణు దేశాయ్ తో విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ మరో విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇక కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో రేణుదేశాయ్ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు అందుబాటులో ఉంటుంది.ఎప్పటికప్పుడు వారి గురించి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube