Abira Dekhta Veerasamy : దక్షిణాఫ్రికాలో భారత సంతతి బాలిక కిడ్నాప్.. స్కూల్ బస్సులోంచే అపహరణ

దక్షిణాఫ్రికాలో 8 ఏళ్ల భారత సంతతి బాలిక కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రెండు వారాల క్రితం కేప్‌టౌన్‌లోని గేట్స్‌విల్లేలో చోటు చేసుకుంది.

 8 Years Old Indian-origin Minor Girl Kidnapped In South Africa , Veerasamy, Sout-TeluguStop.com

దుండగుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.

రిలాండ్స్ ప్రైమరీ స్కూల్‌లో చదువుతున్న అబిరా దేఖ్తా నవంబర్ 4వ తేదీన తన స్కూల్ బస్సులో కూర్చొని వుండగా అపహరణకు గురైంది.సెల్‌ఫోన్ వ్యాపారవేత్త అస్లాం దేఖ్తా, సలామాల ఐదుగురు పిల్లల్లో అబిరా ఒకరు.

వీరి కుటుంబం రైలాండ్స్‌లో నివసిస్తోంది.ఈ ఘటనపై గేట్స్‌విల్లే నైబర్‌హుడ్ వాచ్ ఛైర్‌పర్సన్ ఫౌజియా వీరాసామి మాట్లాడుతూ.

సీసీటీవీ ఫుటేజ్‌ని పోలీసులకు అందజేశామని.దీనిపై మరింత సమాచారం తెలియాల్సి వుందన్నారు.

ఘటన జరిగిన రోజున తెల్లటి నిస్సాన్ డబుల్ క్యాబ్ బక్కీ వేగంగా డ్రైవ్ వేలోకి ప్రవేశించినట్లు వీరాసామి తెలిపారు.ఇద్దరు వ్యక్తులు మారణాయుధాలతో వాహనంలోంచి దూకి డ్రైవర్‌ను తుపాకీతో పట్టుకున్నారు.

వారు డ్రైవర్ సెల్‌ఫోన్‌ను లాక్కొని అబిరాను ఎత్తుకుని బలవంతంగా కారు ఎక్కించినట్లు వీరాసామి తెలిపారు.

Telugu Indianorigin, Abira Dekhta, Indian Origin, Rylandsprimary, Africa, Veeras

మరోవైపు.దక్షిణాఫ్రికా పోలీస్ సర్వీస్ విభాగం వారు కేసు సున్నితత్వం నేపథ్యంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేకపోతోంది.స్థానిక మీడియా కథనాల ప్రకారం.

వెస్ట్రన్ కేప్‌లో కనీసం 200 మంది కిడ్నాప్‌లు జరగ్గా, అందులో అబీరా కేసు తాజాది.చాలా కిడ్నాప్‌లు డబ్బు కోసమే జరుగుతున్నట్లుగా పోలీసులు తెలిపారు.

అయితే కిడ్నాపర్ల ఫోన్ కాల్ కోసం తాము ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని అబిరా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube