మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భగవంతున్ని భక్తిగా పూజించే భక్తులకు కష్టాలు తప్పడం లేదు.నిన్న జరిగిన శివ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించిన కొందరి భక్తుల జీవితాల్లో మరచిపోని విషాదాన్ని నింపాయి.
శివ పూజ చేసుకుని, మరో గుడికి వెళ్లుతున్న నూతన జంట ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.
ఇక రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లా అస్పూర్ గ్రామంలో ఉన్న ఓ ఆలయంలో పంపిణీ చేసిన ప్రసాదం తిన్న వారిలో 70 మంది ఆసుపత్రి పాలైన ఘటన చోటుచేసుకుంది.
ఈ గ్రామంలోని శివాలయంలో నిన్న ఘనంగా వేడుకలు ప్రారంభమయ్యాయి.ఈ క్రమంలో ఆలయాన్ని సందర్శించిన భక్తులకు అధికారులు ప్రసాదం పంపిణీ చేశారు.
అలా ప్రసాదం తీసుకున్న భక్తుల్లో సుమారుగా 70 మంది వరకు భక్తులు అస్వస్థతకు గురయ్యారట.వెంటనే అప్రమత్తమైన అధికారులు, భాదితులందరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారట.కాగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అస్పూర్ ముఖ్య వైద్యాధికారి తెలిపారు.ఈ సంధర్భంగా విషపూరిత ప్రసాదం తినడం వల్లే ఇలా జరిగిందని, బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపామని ఆ రిజల్ట్ వస్తే గానీ క్లారీటిగా తెలియదని పేర్కొన్నారు.