కేవలం ఆ ఒక్క ప్రాంతం లోనే 60 కోట్లు..'జైలర్' రికార్డు ని అందుకోవడం మన హీరోలకు అసాధ్యమే!

రీసెంట్ గా విడుదలైన సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’( jailer ) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న సునామి ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో , వర్కింగ్ డేస్ లో కూడా గంటకి సగటున 20 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి.

 60 Crores In Just That One Area It Is Impossible For Our Heroes To Get The 'jail-TeluguStop.com

వీకెండ్స్ లో కాకుండా వర్కింగ్ డేస్ లో ఒక సినిమాకి ఈ స్థాయి టికెట్స్ అమ్ముడుపోవడం అనేది ఎప్పుడూ జరగలేదు.సూపర్ స్టార్ సినిమాకి ఒక మోస్తారు టాక్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఏ రేంజ్ లో మోతెక్కిపోతుందో, ఇది ఒక ఉదాహరణ అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

ఆయనకీ ఇంత క్లీన్ సూపర్ హిట్ సినిమా వచ్చి దాదాపుగా 8 ఏళ్ళు అయ్యింది.శంకర్( Shankar ) తో తీసిన 2 పాయింట్ O కూడా కమర్షియల్ గా ఎబోవ్ యావరేజి గా నిల్చింది.

Telugu Jailor, Kannada, Karnataka, Rajinikanth, Siva Rajkumar-Movie

తెలుగు లో కూడా ఇదే పరిస్థితి, ఆయనకీ హిట్ తగిలి చాలా కాలమే అయ్యింది, అలాంటి సందర్భం లో ఈ జైలర్ చిత్రం డబ్బులు పెట్టి కొన్న ప్రతీ బయ్యర్ కి పదింతలు లాభాలను తెచ్చిపెట్టింది.కేవలం 12 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి ఇప్పటి వరకు 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.త్వరలోనే ఈ చిత్రం రజినీకాంత్ హైయెస్ట్ తెలుగు దబ్ గ్రాసర్ రోబో సిరీస్ వసూళ్లను అధిగమిస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లో 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో 650 కోట్ల రూపాయిలు వసూలు చేస్తుందని అనుకుంటున్నారు.

కేవలం ఓవర్సీస్ నుండే ఈ చిత్రానికి ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

Telugu Jailor, Kannada, Karnataka, Rajinikanth, Siva Rajkumar-Movie

ఇకపోతే ఈ సినిమా కేవలం కర్ణాటక ప్రాంతం నుండి 60 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది.కన్నడ ( Kannada )చిత్రాలకే అక్కడ ఈ స్థాయి వసూళ్లు ఎప్పుడో 5 ఏళ్లకు ఒకసారి వస్తుంటాయి.అలాంటిది రజినీకాంత్ కి అవలీల గా వచ్చేసాయి అంటే ఆయన రేంజ్ కారాన్తక ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ వసూళ్లు ఇంత స్థాయిలో రావడానికి ఈ చిత్రం లో గెస్ట్ రోల్ చేసిన శివ రాజ్ కుమార్( Siva Rajkumar ) కూడా ఒక భాగం అని అంటున్నారు ట్రేడ్ పండితులు.మన టాలీవుడ్ హీరోస్ కి కర్ణాటక( Karnataka ) లో ఈ స్థాయి మార్కెట్ అయితే లేదు.

ఇప్పటి వరకు ఇక్కడ బాహుబలి చిత్రం మాత్రమే వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది, గత ఏడాది విడుదలైన #RRR చిత్రం కూడా 84 కోట్లు మాత్రమే వసూలు చేసింది, కానీ రజినీకాంత్ కేవలం నార్మల్ కమర్షియల్ మూవీ తో రికార్డ్స్ ని బద్దలు కొట్టేసాడు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube