కడప జిల్లాలో అమానుష ఘటన వెలుగుచూసింది.ముక్కు పచ్చలారని చిన్నారిపై ఓ కామాంధుడు లైగింక దాడికి పాల్పడ్డాడు.
అనంతరం అత్యంత కిరాతకంగా చంపేసి… గుట్టు చప్పుడు కాకుండా గ్రామ శివారులోని ఓ ప్రాంతంలో పూడ్చి పెట్టాడు.ఈ దారుణ ఘటన ఆలస్యంగా బయటపడింది.
మద్యం మత్తులో చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లు నిందితుడు ఓబులేషు అంగీకరించాడు.చిన్నారి హత్య స్థానికంగా తీవ్ర కలకలం స్పష్టించింది.
ముక్కు పచ్చలారని చిన్నారిని పైశాచింకంగా చంపేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు.శవాన్ని పూడ్చిన ప్రదేశానికి పోలీసులు ఓబులేషును తీసుకుని రాగా…అతడిపై దాడికి యత్నించారు.
దీంతో పోలీసులు అందరిని చెదరగొట్టారు.చింతకొమ్మదిన్న మండలం కొప్పర్తి గ్రామానికి చెందిన నాయబ్ రసూల్, మస్తానమ్మ ఆరేళ్ల కూతురు ఆష్మా స్థానిక స్కూల్లో యూకేజీ చదువుతోంది.
ఆడుకోవడానికి ఇంటి నుంచి వెళ్లిన ఆష్మా…ఈనెల 6వ తేదీన కనిపించకుండా పోయింది.దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే శివరాత్రి బందోబస్తులో ఉన్నామంటూ చిన్నారి మిస్సింగ్ కేసును పోలీసులు పట్టించుకోలేదు.రెండు రోజులైనా చిన్నారి ఆచూకి లభించకపోవడంతో మంగళవారం మళ్లీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఈ క్రమంలోనే చిన్నారి ఇంటి పక్కనే ఉండే ఓబులేషు భార్య లక్ష్మమ్మ .తన భర్తే ఆష్మాను హత్య చేశాడని గ్రామ పెద్దకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.మద్యం మత్తులో చిన్నారిపై లైగింక దాడికి పాల్పడి అనంతరం హత్య చేశానని పోలీసు విచారణలో ఓబులేషు అంగీకరించాడు.దీంతో ఓబులేష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఆష్మా శవాన్ని వెలికితీశారు.