ఒక వైపు ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానం వైపు పరుగులు తీస్తుంటే మరో వైపు కులజాడ్యం కూడా వేగంగా వేళ్ళునుకుంటోంది.ఇది సాధారణ ప్రజలపైనే గాక బాగా చదువుకుని ఉన్నత స్థానంలో ఉన్న వారిని కూడా వదలడం లేదు.
ఏళ్లుగా పాతుకుపోయిన కులాల పిచ్చి మనిషిని గుర్తించకుండా చేస్తోంది.ఈ కుల పిచ్చి మధ్యప్రదేశ్ లోని దామోహ్ లో ఒక బాలుడి ప్రాణం తీసింది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎనిమిదేళ్ల బాలుడు దాహార్తితో స్కూళ్లోని చేతిపంపు వద్దకు వెళ్లాడు.అక్కడ అతడిని మంచినీళ్లు తాగేందుకు టీచర్లు అనుమతించకపోవడంతో పక్కనే ఉన్న బావి వద్దకు వెళ్లాడు.
నీళ్లు తాగే ప్రయత్నంలో అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు.ఈ ఘటన పట్ల సీరియస్ గా స్పందించిన ఉన్నతాధికారులు ఆ పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులను, ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.
గురువులే ఇలాంటి పని చేయడంపై మానవ హక్కుల సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.