కాకినాడ జిల్లా గొల్లప్రోలు గ్రామంలో కాపు నేస్తం పథకం 3వ విడత చెక్కు పంపిణీ...

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కాకినాడ జిల్లా గొల్లప్రోలు గ్రామంలో కాపు నేస్తం పథకం 3వ విడత రాష్ట్రవ్యాప్తంగా 3,38,792 మంది లబ్ధిదారులకు 508.18 కోట్ల రూపాయలు బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమచేయగా, కృష్ణాజిల్లాలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆర్కే రో జా, జిల్లా కలెక్టర్, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబులతో కలసి అవనిగడ్డ లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లోకాపు నేస్తం పథకం కింద మూడో విడత 21,720 మంది లబ్ధిదారులకు 32.58 కోట్ల రూపాయలు నమూనా చెక్కు పంపిణీ గావించారు.

 3rd Tranche Check Distribution Of Kapu Nestham Scheme In Gollaprolu Village Of K-TeluguStop.com

ఇంఛార్జి మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ దేశంలో అగ్రవర్ణ కులాల కోసం ప్రత్యేక పథకాన్ని తెచ్చి వారిలో భరోసా కల్పించి, ఉపాధి అవకాశం అందించిన ముఖ్యమంత్రి జగన్ను మనస్ఫూర్తిగా అభినందించారు కులం చూడం, మతం చూడం పార్టీ చూడం, పేదరికమే అర్హతగా పథకాలు అందిస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చారన్నారు.

సంక్షేమ క్యాలెండర్ ప్రకారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ చేస్తున్నారని అన్నారు.కాపు బలిజ తెలగ ఒంటరి కులాల సంక్షేమానికి గత ప్రభుత్వం కేవలం 400 కోట్లు మాత్రమే వ్యయం చేయగా, జగన్ ఒక ఏడాదిలో 32,296 కోట్లు వివిధ పథకాల కింద అందించారన్నారు.

ఏ కులానికి అయినా స్టార్ ఒక్కరే అది జగన్ గారే అంటూ కొనియాడారు.

జిల్లా కలక్టర్ మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో కాపు నేస్తం క్రింద గత మూడు విడతలుగా 65,616 మంది లబ్ధిదారులకు 98.43 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందన్నారు.సభకు అధ్యక్షత వహించిన అవనిగడ్డ శాసనసభ్యులు మాట్లాడుతూ కాపు నేస్తం క్రింద జిల్లాలో మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే అవనిగడ్డ నియోజకవర్గoలో ఎక్కువ మంది లబ్ధి పొందారన్నారు.

పరిపాలనలో పదవులలో అన్ని కులాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ, కులాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్న జగన్ ను మనసారా దీవించండి అంటూ విజ్ఞప్తి చేశారు

నాగాయలంక మండలం భావదేవరపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారు తోట విజయలక్ష్మి కాపు నేస్తం గత రెండు విడతల లబ్ది తో పాటు మా వూరిలో ఇంటి స్థలం వచ్చింది, అమ్మాయి ఎమ్మెస్సీ, అబ్బాయి బీటెక్ చదువుతున్నారు, అత్తింటి వారు పుట్టింటి వారు సాయం చేయకపోయినా సాయం చేసిన జగన్కు జీవితాంతం రుణపడి ఉంటామని, మళ్లీ మళ్లీ ఈ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారుతొలుత ఈడి బిసీ కార్పోరేషన్ లక్ష్మి దుర్గ సభకు స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో అవనిగడ్డ జడ్పిటిసి చింతలపూడి లక్ష్మీనారాయణ, ఎంపీపీ టి.సుమతి, సర్పంచ్ జి.ఉమ, నియోజకవర్గ పరిధిలో పలువురు ఎంపిపిలు, జడ్పీటిసిలు, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube