అతివేగంతో వాహనాలు నడపటం చాలా ప్రమాదకరం.100 కంటే ఎక్కువ స్పీడ్ పోతే ఏ వెహికల్ కూడా కంట్రోల్ కాదు.రోడ్డుపై వెళ్తున్నప్పుడు వెంటనే స్పందించాల్సి ఉంటుంది.ఆ వేగంలో రియాక్ట్ అయ్యే టైం కూడా ఉండదు.కళ్ళు మూసి తెరిచేలోగా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్ల్స్ అని పోలీసులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు కానీ కుర్రవాళ్ళు ఉడుకు రక్తంతో ఈ మాటలను పట్టించుకోకుండా దూసుకుపోతుంటారు.
చివరికి కన్నవారికి కడుపుకోత మిగుల్చుతారు తాజాగా మరో నలుగురు యువకులు ఇలాంటి పిచ్చి పనే చేసి చివరికి కాటికి పోయారు.
వివరాల్లోకి వెళితే, గుజరాత్‌లోని( Gujarat ) వసాద్‌లో ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఘటనలో నలుగురు యువకులు మరణించగా, మరొక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.ఈ ఘటనను మృతులలో ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌లో( Instagram ) లైవ్‌గా స్ట్రీమ్ చేశారు, ఆ ఫుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌గా స్ట్రీమ్ చేసిన ఒక వీడియోలో, ఐదుగురు యువకులు పార్టీ చేసుకుంటూ, బిగ్గరగా ప్లే చేస్తున్న పాటలకు ఊగుతూ కనిపించారు.లైవ్‌లో 140 కిలోమీటర్ల వేగంతో కారు( Car ) నడుపుతున్నట్లు చూపిస్తున్నారు.కానీ, హఠాత్తుగా, డ్రైవర్ ఒకదాని తర్వాత ఒకటి ట్రక్కులను( Trucks ) దాటడం ప్రారంభించాడు, ఆ తర్వాత కారు ఘోరంగా నియంత్రణ కోల్పోయి పల్టీలు కొట్టింది.ఈ ఘటనలో నలుగురు యువకులు మరణించగా, మరొక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
మరో ఘటనలో 7 మంది కుటుంబ సభ్యులు గల్లంతయ్యారు.నర్మదా నదిలో( Narmada River ) ప్రవహించే నీటి ప్రవాహంలో చిక్కుకుని ఈ ఏడుగురు కుటుంబ సభ్యులు గల్లంతైనట్లు భావిస్తున్నారు.ఈ కుటుంబంలో పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం.ఆ కుటుంబ సభ్యుల కోసం స్థానిక NDRF డైవర్లు, వడోదర అగ్నిమాపక సిబ్బంది సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు కానీ ఇప్పటివరకు ఎటువంటి ఆనవాళ్లు కనుగొనలేదు.
మంగళవారం ఉదయం నది ప్రవాహంలో చిక్కుకున్న బాధితులు సూరత్ నుంచి వచ్చిన ఒక బృందంలో భాగమని పోలీసులు తెలిపారు.అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు.