పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్- 'ఎఫ్3' మూవీ నుండి పూజా హెగ్డే స్పెషల్ 'లైఫ్ అంటే ఇట్లా వుండాలా' పాట ప్రోమో విడుదల.. క్షణాల్లో వైరల్

బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఫన్ ఫ్రాంచైజీ ‘ఎఫ్3’ మూవీని అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే వినోదాత్మక అంశాలు ఉండేట్లు రూపొందిస్తున్నారు.విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సమ్మర్ సోగ్గాళ్ళుగా సందడి చేయబోతున్న ‘ఎఫ్3’… థియేట్రికల్ ట్రైలర్ ద్వారానే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించబోతుందని రుజువుచేసింది.

 Promo Of Party Song Of The Year- Life Ante Itla Vundaalaa From F3 Featuring Pooj-TeluguStop.com

ఎఫ్3‘ మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ఎఫ్ 3 నుండి విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.ఎఫ్ 3 థీమ్ ప్రకారం డిజైన్ చేసిన మొదటి పాట ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు’ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది.

పదేపదే పాడుకునే పాట గా నిలిచింది.రెండో పాట ‘వూ.ఆ.ఆహా’లో తమన్నా , మెహ్రీన్ గ్లామర్ తో పాటు సోనాల్ చౌహాన్ ఎక్స్ ట్రా గ్లామర్‌ని జోడించారు.ఇప్పుడు ఎఫ్3 గ్లామర్ ని మరింత పెంచారు పూజా హెగ్డే.ఎఫ్3 లో పూజ హెగ్డే స్పెషల్ పార్టీ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.”లైఫ్ అంటే ఇట్లా వుండాలా’ అనే పాటతో అలరించబోతుంది పూజా హెగ్డే.

రేపు ( మే 17) ఈ పాట లిరికల్ వీడియో ని విడుదల చేయనున్నారు.

ఈ రోజు పాట ప్రోమో రిలీజ్ చేశారు.రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ పాట కోసం చేసిన ట్యూన్ అదిరిపోయింది.

సూపర్ ఎనర్జిటిక్ నెంబర్ ని ఈ పార్టీ సాంగ్ కోసం ట్యూన్ చేశారు దేవిశ్రీ ప్రసాద్.వెంకటేష్, వరుణ్ తేజ్, పూజా చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులని అలరించాయి.

ఈ ప్రోమోని చూసి ‘స్పెషల్ సాంగ్ అంటే ఇట్లా వుండాలా” అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు.ప్రోమో విడుదలైన క్షణాల్లోనే వైరల్ అయ్యింది.

సోషల్ మీడియాతో పాటు అన్ని వేదికలపై ఇప్పుడు ఇదే ప్రోమో ట్రెండ్ అవుతుంది.
♪♪ హత్ మే పైసా
మూతి మే సీసా
పోరితో సాల్సా
రాతిరంతా జల్సా ♪♪
కసార్ల శ్యామ్ అందించిన ఈ క్యాచి లిరిల్స్ పార్టీ సాంగ్ కి తగ్గట్టు మళ్ళీమళ్ళీ పాడుకునేలా వున్నాయి.

మొత్తానికి కలర్ ఫుల్ అండ్ ఎనర్జిటిక్ ప్రోమోతో ఈ పాటపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఎఫ్3 ‘ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి.ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube