త్వరలో వైసీపిలోకి దగ్గుబాటి ఫ్యామిలీ..డీల్ ఇదే

రాష్ట్ర రాజకీయాల్లో దగ్గుబాటి ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది.తాము ఏ పార్టీ లోకి వెళ్ళాలని అనుకున్నా సరే ఆ పార్టీ తలుపులు తెరిచే ఉంచుతారు అధినేతలు.

 Daggubati Family To Join In Ysrcp-TeluguStop.com

దగ్గుబాటి పురంధరేశ్వరి ఎన్టీఆర్ కుమార్తె అయ్యి ఉన్నా సరే చంద్రబాబు తో వచ్చిన విభేదాలు కారణంగా ఆమె కాంగ్రెస్ గూటికి చేరగా ఆమెకి కాంగ్రెస్ ఎంతో ఉన్నతమైన పదవులు కట్టబెట్టుకుంటూ వచ్చింది అయితే విభజన తరువాత కాంగ్రెస్ కి దూరం అయిన తరువాత బీజేపి లోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న దగ్గుబాటి ఫ్యామిలీ కి బీజేపి సైతం స్వాగతం పలికింది అయితే.

మారుతున్న రాజకీయ పరిస్థితులకి అనుగుణంగా వచ్చే ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని ఎంతో మంది బీజేపి నేతలు వైసీపి లోకి వెళ్తున్న సమయంలో పురంధరేశ్వరి సైతం వైసీపి లోకి తొంగి చూస్తున్నారని తెలుస్తోంది.అంతేకాదు పురంధరేశ్వరి రాక కోసం జగన్ ఎప్పుడే ఆమెకి కబురు కూడా పంపాడట…ఆమె అడిగింది చేయడానికి జగన్ సిద్దంగా ఉన్నానని చెప్పడంతో జగన్ తో దగ్గుబాటి సీట్ల విషయంలో డీల్ కూడా కుదుర్చుకున్నారని అంటున్నారు దగ్గుబాటి వర్గీయులు.

అయితే.

ఇంతకు ముందు దగ్గుబాటి పురంధరేశ్వరి తన సోదరుడు బాలయ్య ద్వారా తెలుగుదేశం లోకి తన కొడుకు చెంచురాం ని పరుచూరు నుంచీ పోటీ చేయించేలా చేయమని చెప్పిందని.అందుకు చంద్రబాబు సైతం ఒప్పుకున్నరనే వచ్చిన వార్తలు అన్ని కల్పితాలని దగ్గుబాటి ఫ్యామిలీ కొట్టి పారేసింది.

మేము తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేసింది.

దగ్గుబాటి వారసుడు హితేష్ చెంచురాం కి పరుచూరు అసెంబ్లీ టికెట్, పురందేశ్వరి కి విజయవాడ ఎంపి టికెట్ ఇచ్చే హామీ మీద చేరతాము చెప్పినట్టుగా తెలుస్తుంది…

అయితే ఈ విషయంలో జగన్ ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయలేదట అడిగిందే తడవుగా ఒకే చెప్పినట్టుగా తెలుస్తోంది.

అంతేకాదు జగన్ కృష్ణా జిల్లా పర్యటనలో ఎన్టీఆర్ జిల్లా పేరుగా మారుస్తానని చెప్పటం కూడా ఇందులో భాగామేనని .ఒక వేళ దగ్గుబాటి ఫ్యామిలీ రాక ఖారారు అయితే మాత్రం వైసీపి కి ఏ మాత్రం పట్టులేని కమ్మ జిల్లాలుగా పేరు గాంచిన గుంటూరు ,కృష్ణా లలో జగన్ చక్రం తిప్పుతాడు అనడంలో సందేహం లేదు అంటున్నారు విశ్లేషకులు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube