వైయస్సార్సిపి మేనిఫెస్టో అంతకుమించి?

సంక్షేమ పథకాల రూపకల్పన వాటి అమలు తీరులో దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం( Andhra Pradesh ) ముందంజలో ఉందంటే అతిశయోక్తి కాదు.ఆ స్థాయిలో ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి.

 Ysrcp Thinking For Special Manifesto , Ysrcp , Cm Jagan , Ycp , Politics , Td-TeluguStop.com

ప్రతి కుటుంబానికి ఏదో ఒక ప్రయోజనం కలిగించే రీతిలో అనేక విశిష్టమైన పథకాలు రూపొందించి వాటిని అమలు చేస్తున్నారు.అయితే అభివృద్ధిలో వెనుకబడి ఉందని, మౌలిక సదుపాయాలు సరైన రీతిలో అభివృద్ధి చెందలేదు అన్న విమర్శలుకూడా ఉన్నాయి.

Telugu Chandrababu, Cm Jagan, Lokesh, Tdp, Ysrcp-Telugu Political News

ఎన్నికలు దగ్గరలో ఉన్నందున ప్రతిపక్షాలు రోజురోజుకీ పుంజుకుంటూ అధికార ప్రభుత్వంపై ఎడతెగని పోరాటం చేస్తున్నాయి.పొలిటికల్ గా కూడా నువ్వా నేనా అన్న పరిస్థితిలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి ఉన్నాయి.ప్రతిపక్షాలు ఒకే తాటిపైకి వచ్చి సమర శంఖం మోగిస్తుండటంతో ఇప్పుడు ఎన్నికల యుద్ధం లో అధికార వైసిపి ( YCP )కొంత వెనకబడిన పరిస్థితి కనిపిస్తుంది.దాంతో ఇప్పుడు కొత్త అస్త్రాల కోసం వెదు కుతున్న వైసిపి తన మేనిఫెస్టోను సుదర్శన చక్రంలా ప్రయోగించాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది.

ముఖ్యంగా రైతులను, మహిళలను టార్గెట్ చేసి భారీ ఎత్తున హామీలు ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది .

Telugu Chandrababu, Cm Jagan, Lokesh, Tdp, Ysrcp-Telugu Political News

ఏపీలో ఇప్పటికీ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు లక్షల సంఖ్యలో ఉన్నందున వారిని ఆకట్టుకునేలా రుణమాఫీ హామీను ఇవ్వాలని వైసిపి అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.గతంలో టిడిపి కూడా ఈ తరహా హామీ ఇచ్చి భారీగా లబ్ది పొందినప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ,అలా కాకుండా సంక్షేమ పథకాల హామీలు ఇప్పటికే తాము మాట ఇస్తే వెనకడుగు వేయమన్న పేరు తెచ్చుకున్నందున రుణమాఫీ కచ్చితంగా అమలు చేస్తామన్న హామీని ఇచ్చి ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవాలని వైసిపి అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.అంతేకాకుండా మహిళలు ఆకట్టుకునేలా డ్వాక్రా రుణమాఫీలు లేదా ప్రత్యేక రుణాలు అందజేసే ఏదైనా ఒక పథకాన్ని అమలు చేయాలని వైసీపీ వ్యూహ కర్తలు తమ ప్రణాళికలకు పదును పెడుతున్నట్లుగా తెలుస్తుంది.

ఇలా తమ మానిఫెస్టో తో ప్రతిపక్షాలకు అందనంత ఎత్తులో నిలవాలని జగన్( CM jagan )భావిస్తున్నట్లుగా తెలుస్తుంది .మరి జగన్ ఇచ్చే తాయిలలను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఎలాంటి ప్రతివ్యూహాలు అమలు చేస్తాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube