పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ స్టార్ హీరో...

ప్రస్తుత కాలంలో చాలామంది యువ హీరోలు కూడా కెరియర్ పీక్స్ లో ఉండగానే రాజకీయాలలోకి వెళ్లడానికి పెద్ద ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే హీరో నితిన్ ( Nithin )కూడా పాలిటిక్స్ లోకి వెళ్లబోతున్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

 Young Star Hero Entering Politics, Nithin , Nizamabad District Politics, Assembl-TeluguStop.com

వరుస సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈయన పాలిటిక్స్ లో కూడా అందరి మనసులు దోచుకుంటారా? వచ్చే ఎన్నికలలో అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారా? అంటూ రకరకాల అనుమానాలు ప్రేక్షకులలో కలుగుతున్నాయి.

Telugu Assembly, Amit Shah, Nagesh Reddy, Nithin, Nizamabad, Young-Telugu Politi

నిజామాబాద్ జిల్లా పాలిటిక్స్( Nizamabad District Politics ) పై ఆయన ఆసక్తి చూపిస్తున్నారు అంటూ ఇప్పుడు కొత్త చర్చ తెరపైకి వచ్చింది.నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంతో ఆయనకున్న అనుబంధం కారణంగా ఆ సీటుపై మనసు పారేసుకున్నారట నితిన్.అందుకే త్వరలోనే రాజకీయాల్లోకి రావాలని కొద్ది రోజుల క్రితం బిజెపి అగ్రనేత హోం మంత్రి అమిత్ షా( Home Minister Amit Shah ) ఆయనను స్వయంగా ఆహ్వానించారని కూడా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

 Young Star Hero Entering Politics, Nithin , Nizamabad District Politics, Assembl-TeluguStop.com

ఇకపోతే అమిత్ షా ఆహ్వానాన్ని నితిన్ సున్నితంగా తిరస్కరించాడని సమాచారం.ఇకపోతే యువ హీరో నితిన్ రాజకీయాల్లోకి వస్తున్నారు అంటూ గతంలో పలుమార్లు ప్రచారం జరిగినా సరే ఈ విషయాలను ఆయన కుటుంబ సభ్యులు కొట్టి పారేశారు.

ఇక నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మోపాల్ మండలానికి చెందిన నితిన్ కుటుంబం చాలాకాలంగా నిర్మాణరంగంలో దూసుకుపోతోంది.ఇక ఆయన దగ్గర ఉన్న బంధువులు మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.

అందుకే నితిన్ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్నారు అనే ప్రచారం ఇప్పుడు మరింత పెరిగింది.త్వరలోనే పీ సీ సీ చీఫ్ రేవంత్ రెడ్డిని( PCC Chief Revanth Reddy ) కలిసే ఆలోచనలో నితిన్ ఉన్నట్లు సమాచారం.

Telugu Assembly, Amit Shah, Nagesh Reddy, Nithin, Nizamabad, Young-Telugu Politi

ఇకపోతే తమ కుటుంబ సభ్యులు రాజకీయాలలో ఉన్నా కూడా ఈయన మాత్రం ప్రస్తుతం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు.కెరియర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టారు.ఇక నితిన్ మేనమామ పీ సీ సీ కార్యదర్శి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్ రెడ్డి( Nagesh Reddy ) నిజామాబాదు రూరల్ అసెంబ్లీ నుంచి సీటు ఆశిస్తున్నారట.మరొకవైపు కాంగ్రెస్లో తాజాగా చేరిన మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి కూడా సీటు ఆశిస్తున్నారని ఇదే టికెట్ను మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కూడా టికెట్ ను ఆశిస్తూ ఉండడంతో సర్వేల ఆధారంగా ఎవరు బలంగా ఉంటే వాళ్లకే టికెట్ ఇస్తామని రేవంత్ చెప్పారు.

అందుకే తనకు కాకపోయినా నితిన్ కి టికెట్ ఇచ్చినా ఓకే అనే ప్రపోజల్ ని కూడా పెట్టారట నగేష్ రెడ్డి.మరి ఇది ఏమవుతుందో చూడాలి.ఇక ఒక వేళ నితిన్ రాజకీయాల్లోకి వస్తే అటు సినిమాలు ఇటు రాజకీయాలు రెండు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube