కొంతమంది డైరెక్టర్లు చాలా మంచి సినిమాలు తీసినప్పటికీ కొంతమంది హీరోల దగ్గరికి వచ్చినప్పటికీ మాత్రం మంచి సినిమాలు తీయడంలో చాలా వరకు ఫెయిల్ అయిపోతూ ఉంటారు అలాంటి వాళ్లలో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకసారి మనం తెలుసుకుదాం…మొదటగా డైరెక్టర్ పరుశురాం( Director Parashuram ) గురించి చూసుకుంటే ఈయన నిఖిల్ హీరోగా యువత( Yuvatha Movie ) అనే సినిమా తీశాడు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది ఇక దాంతోపాటు ఆ తర్వాత రవితేజ హీరోగా ఆంజనేయులు ( Anjaneyulu Movie ) అనే సినిమా చేశాడు ఈ సినిమాలో కామెడీ వర్కౌట్ అయినప్పటికీ కథ పెద్దగా ఇంప్రెస్ చేయకపోవడంతో ఈ సినిమా ఫ్లాప్ అయింది.
ఇక ఆ తర్వాత నారా రోహిత్ తో సోలో అనే సినిమా తీశాడు ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చాలా మంచి విజయాన్ని అందుకుంది దాంతో ఆ తర్వాత మళ్లీ రవితేజ ని హీరో గా పెట్టి సారొచ్చారు అనే సినిమా తీశాడు ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది ఇక ఈ సినిమా తర్వాత ఆయన అల్లు శిరీష్ ని పెట్టి శ్రీరస్తు శుభమస్తు అనే సినిమా తీశాడు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది
ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా గీత గోవిందం( Geetha Govindam ) అనే సినిమా తీశాడు ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది ఇక ఆ తర్వాత మహేష్ బాబుతో సర్కారు వారి పాట ( Sarkaru Vari Paata )అనే సినిమా తీశాడు.ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది… ఇలా ఈయన పెద్ద హీరోలకి హిటివ్వలేడు అనే ఒక రిమార్క్ అయితే సంపాదించుకున్నాడు…
ఇక ఈయన తో పాటుగా పెద్ద హీరోలకు హిట్ ఇవ్వలేని మరో డైరెక్టర్ ఎవరంటే సుజిత్( Director Sujeeth ) అనే చెప్పాలి.తన కెరియర్ లో మొదటి సినిమా అయినా రన్ రాజా రన్( Run Raja Run ) సినిమాను తీసి శర్వానంద్ కి ఒక మంచి హిట్ ఇచ్చిన సుజిత్ ఆ తర్వాత ప్రభాస్ తో చేసిన సాహో సినిమా( Sahoo Movie ) మాత్రం ఫ్లాప్ అయింది ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా హిట్ కొట్టి సుజిత్ పెద్ద హీరోలకి హిట్ ఇవ్వలేడు అనే ఒక రిమార్కుని తన మీద నుంచి పోయేలా చేసుకుంటాడని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు…
.