మీరు ఒక లక్ష పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి వ్యాపారాలను ప్రారంభించవచ్చు, అప్పుడు మీరు ఉద్యోగం కంటే ఎన్నో రెట్లు డబ్బు సంపాదించగలుగుతారు. లక్ష బడ్జెట్‌లో అత్యంత లాభదాయకమైన వ్యాపకాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ నిరుద్యోగ యుగంలో చాలా మంది యువత ఉద్యోగాల కోసం ఊరూవాడా తిరుగుతున్నారు.లక్షలు వెచ్చించి చదువుకుంటున్నా యువతకు ఉద్యోగాలు రావడం లేదు.
అయితే వీటన్నింటి మధ్య తక్కువ డబ్బుతో వ్యాపారం ప్రారంభించి, మంచి స్థానానికి ఎదిగిన యువతీయువకులు కూడా ఉన్నారు.మీరు ఒక లక్ష లేదా అంతకంటే తక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రారంభించి, మీ ఉజ్వల భవిష్యత్తును సృష్టించుకోగల కొన్ని వ్యాపారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బేకరీ పరిశ్రమ
నేటి యుగంలో బేకరీ వ్యాపారం అత్యుత్తమ వ్యాపారాలలో ఒకటి.మీరు ఈ వ్యాపారం కోసం తక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాలి.
మీరు కాలక్రమేణా మంచి లాభాలను సంపాదించవచ్చు.ఈ విధమైన వ్యాపారం ప్రారంభించాలనుకుంటే, ముద్రా పథకం కింద మోడీ ప్రభుత్వం మీకు సహాయం అందజేస్తుంది.
ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, మీరు కేవలం ఒక లక్ష మాత్రమే పెట్టుబడి పెట్టాలి.మిగిలిన మొత్తం ఖర్చులో 100% ప్రభుత్వం నుండి పొందే సదుపాయం ఉంది.
పూల వ్యాపారం
మీరు ప్రకృతి ప్రేమికులైతే మీరు ఒక లక్ష రూపాయలతో పూల వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.పెళ్లిళ్ల సీజన్‌లో పూలకు విపరీతమైన డిమాండ్ ఉంది.అదేవిధంగా, ఏడాది పొడవునా చాలా సందర్భాలలో పూలు అవసరం అవుతుంటాయి.ఈ వ్యాపారంలో గొప్పదనం ఏమిటంటే ఇప్పుడు మీరు ఆన్‌లైన్‌లో కూడా పూలను అమ్మవచ్చు.అందుకే మీరు తక్కువ డబ్బుతో మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, పూల వ్యాపారం మీకు చాలా అనుకూలంగా ఉంటుందని గమనించండి.
కలబంద వ్యాపారం
ఇప్పుడు ప్రపంచం అంతా ఆయుర్వేదం వైపు చూస్తోంది.ఇటువంటి పరిస్థితిలో కలబంద వ్యాపారం ఉత్తమమైనదని చెప్పుకోవచ్చు.మీరు చాలా తక్కువ మొత్తంతో అలోవెరా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
కేవలం 10 వేల రూపాయలతో దాదాపు 2500 కలబంద మొక్కలు నాటవచ్చు.మీరు కలబంద మొక్కలతో పాటు దాని జెల్ వ్యాపారం కూడా చేయవచ్చు, ఈ రోజుల్లో అలోవెరా జెల్ దాదాపు అన్ని ఇళ్లలో ఉపయోగిస్తున్నారు.