మంత్రి అంబటి కామెంట్స్.పార్టీకి విశ్వాసంగా,నమ్మకంగా పని చేసే వారికి ప్రతిఫలంగా పదవులు వస్తాయనటానికి నిదర్శనమే నాకు లభించిన మంత్రి పదవి.
వైసీపీ పార్టీలో ఎవరు విశ్వాసంగా వున్నా వారికీ ప్రతిఫలం ఉంటుందనడానికి నిదర్శనమే ఈ అంబటి రాంబాబు.సుదీర్ఘ కాలం రాజకీయాలలో వున్నాను.
చిత్తశుద్ధితో, విశ్వాసంతో,నమ్మకంగా పని చేసిన వ్యక్తిని నేను.జగన్ అండతో శాసన సభ్యుడిగా రాజశేఖర్ దగ్గర పని చేశా.
ఇప్పడు జగన్ మోహన్ రెడ్డి దగ్గర శాసన సభ్యుడిగా, మంత్రిగా పని చేస్తున్నా.
తెలుగు దేశం వారొచ్చినా ధర్మమనుకొంటే పని చేసిన శాసన సభ్యుడిని నేను.
ముఠాలు, తగాదాలు ఏర్పడకుండా అందరికి సహకరిస్తూ, అందరినీ కలుపుకు పోతూ న్యాయ బద్దంగా పరిపాలన చేస్తున్నా.ఈ రాష్ట్రంలోని ప్రజలకు 87% సంక్షేమ పథకాలను అందించాం.ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ అని చెబుతున్నాను.వచ్చే ఎన్నికలలో వైసీపీ 175 సీట్లకి 175 సీట్లు గెలిచి తీరుతామన్న మంత్రి అంబటి.