బీసీలకు ఒకటి రెండు పదవులు ఇచ్చి వైసీపీ ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన బీసీల సమావేశంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక రాయితీపై గొర్రెలు ఇస్తామని తెలిపారు.గొర్రెల పెంపకం దారులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామన్నారు.
బీసీలు రాజకీయంగా ఎదిగేందుకు అండగా ఉంటామని చెప్పారు.అంబేద్కర్ ఆలోచనలు ముందుకు తీసుకెళ్తామన్న చంద్రబాబు టీడీపీ వస్తే సంక్షేమ కార్యక్రమాలు తొలగిస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అప్పులు తెచ్చి చేసే సంక్షేమం ముప్పు తెస్తుందని తెలిపారు.ఈ నేపథ్యంలో తాము సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని వెల్లడించారు.