టీడీపీ ఎంపీలపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు గుప్పించారు.పోలవరంకు నిధులు రాకుండా చూడాలని టీడీపీ ఎంపీలు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
పోలవరంలో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్‌లో స్పష్టం చేసిందని తెలిపారు.చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వలనే పోలవరం ఆలస్యం అయిందని విమర్శించారు.
టీడీపీ నేతలకు ప్రజల కంటే రాజకీయాలే ముఖ్యమని ఎద్దేవా చేశారు.