జనసేన లోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వైసీపీ ఎమ్మెల్యే..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగునున్నాయి.2019 కంటే 2024 ఎన్నికలను ప్రధాన పార్టీల నేతలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా పోటీ చేయనుంది.టీడీపీ జనసేన( TDP Janasena ) పార్టీలు కలసి పోటీ చేయబోతున్నాయి.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చంద్రబాబు, పవన్ ఇద్దరు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇదే సమయంలో ఎన్నికలు దగ్గర పడే కొలది ఒక పార్టీ నుండి మరొక పార్టీలో వెళుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

 Ycp Mla Has Denied The Campaign That He Is Going To Join Jana Sena , Ycp Mla Sam-TeluguStop.com

ఇటీవల గత వారం చాలామంది ప్రముఖ నేతలు ఒక పార్టీ నుండి మరొక పార్టీలో జాయిన్ కావడం జరిగింది.

తెలుగుదేశం పార్టీకి చెందిన నేత ఎంపీ కేశినేని నాని.( Kesineni nani ) పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వైసీపీ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో జాయిన్ అవుతున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో జాయిన్ అవుతున్నట్లు గత కొద్దికాలం నుండి ప్రచారం జరుగుతుంది.ఈ క్రమంలో తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని వార్తలను సామినేని ఉదయభాను ఖండించారు.

పార్టీ మారేది ఏమీ లేదని తాను వైసీపీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు.ఈ క్రమంలో వదంతులు నమ్మొద్దని సూచించారు.కాగా జగ్గయ్యపేట టికెట్ ఈసారి ఉదయభానుకు కాకుండా కొత్తవారికి కేటాయిస్తున్నట్లు.అందువల్లే ఆయన పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే అలాంటిదేమీ లేదని తాజాగా ఉదయభాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube