వివేకానంద రెడ్డి ( Vivekananda Reddy )కేసులో జరుగుతున్న పరిణామాలు వైసిపి ( YCP ) అధిష్టానాన్ని కలవరపాటకు గురి చేశాయని అందుకే ఆయన తన కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నారని, లండన్ పర్యటనలు కూడా రద్దు చేసుకున్నారని జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నారని తన వర్గం లాయర్లతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నారని తెలుగుదేశం అనుకూల మీడియాలో వరుసగా కథనాలు వస్తున్నాయి.వైయస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక అవినాష్ రెడ్డి ( Avinash Reddy )వర్గం ప్రత్యక్ష ప్రమేయం ఉందని
అయితే తెర వెనుక మరి కొంతమంది పెద్దల హస్తం కూడా ఉందని సిబిఐ కోర్టులో కూడా వాదించిందని ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి కేసును మరింత ముందుకు తీసుకెళ్తే వైసీపీలను కొంతమంది కీలక నాయకుల కు కూడా ఇబ్బంది ఏర్పడుతుందంటూ వైసీపీ అధిష్టానం కంగారుపడుతుందని,, ఢిల్లీ పెద్దలు కూడా ఈ వ్యవహారంలో ముఖం చాటేసారని ఈ పరిణామాలన్నీ రాజకీయంగా వైయస్సార్ కాంగ్రెస్ కి ఇబ్బందికరమైన అంటూ విశ్లేషణలు ఇబ్బడిముబ్బడి గా వస్తున్నాయి….ఈ విశ్లేషణలో ఏ మేరకు నిజం ఉంది అన్నది పక్కన పెడితే అవినాష్ రెడ్డి వ్యవహారంలో మాట్లాడడానికి వైసిపి నాయకులు కొంత ఇబ్బంది పెడుతున్నారు అన్నదైతే నిజం.
అయితే కాంగ్రెస్కు మద్దతు ఇవ్వనందుకు కేసులు పేరుతో వేధించి 16 నెలలపాటు అన్యాయంగా జరిగా ఉంచినప్పుడే జగన్ ( Jagan )మనోధర్యం దెబ్బతినలేదని అలాంటిది తన సోదరుడి కేసుకు సంబంధించి జగన్ భయపడుతున్నారంటూ ప్రచారం చేయడం ఎల్లో మీడియా సృష్టి తప్ప తమ నాయకుడు ఎవరికి భయపడే రకం కాదని ఆ దేవుడిని ఈ ప్రజల్ని నమ్ముకుని జగన్ రాజకీయం చేస్తున్నాడని తప్ప ఏ అధినేతల్ని ప్రసన్నం చేయడానికి కాదని వైసిపి నాయకులు రిటార్టిస్తున్నారు .
అయితే ఉన్నట్టుండి వివేకానంద రెడ్డి హత్య కేసులో పరిణామాలు వేగంగా మారటం మాత్రం ఆంధ్ర రాజకీయాలలో వేడిని పెంచినట్టుగా తెలుస్తుంది గంట గంటకు మారుతున్న పరిణామాలు వేసవి వేడిని మించిన వేడిని ప్రజలకు పరిచయం చేస్తున్నట్టుగా తెలుస్తుంది… ముగింపు దశకు వచ్చిన ఈ కేసులో చివరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి
.