వైసీపీ ప్రభుత్వం డ్యాన్సులు చేస్తోంది..: వైఎస్ షర్మిల

ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు( Gundlakamma Reservoir Project )ను ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( AP PCC chief YS Sharmila ) పరిశీలించారు.అనంతరం షర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్ కట్టిన ప్రాజెక్టును నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని తెలిపారు.

 Ycp Government Is Dancing..: Ys Sharmila, Ys Jagan, Ap Pcc Chief Ys Sharmila ,-TeluguStop.com

నిర్వహణ లేకే గేట్లు కొట్టుకుపోయాయని షర్మిల ఆరోపించారు.వైసీపీ ప్రభుత్వం గేట్లు కొట్టుకుపోతుంటే డ్యాన్సులు చేస్తోందని విమర్శించారు.

మంత్రి సంక్రాంతి డ్యాన్సులు చేస్తారు తప్ప పని చేయరని పేర్కొన్నారు.జగనన్నకు మరమ్మత్తులు చేయించడానికి మనసు రావడం లేదా అని ప్రశ్నించారు.

ఇదేనా వైఎస్ఆర్ ఆశయాలను నిలబెట్టడమని ధ్వజమెత్తారు.వైఎస్ఆర్( YSR ) కట్టిన ప్రాజెక్టును పట్టించుకోని వారు వైఎస్ఆర్ వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు.ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే ప్రాజెక్ట్ కూలిపోయే ప్రమాదం ఉందని తెలిపారు.రూ.10 కోట్లు ఇస్తే ప్రాజెక్టు నిలబడుతుందన్న షర్మిల వెలిగొండ ప్రాజెక్టును కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube