సూర్యాపేట మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం వేళ ట్విస్ట్ నెలకొంది.సమావేశం ప్రారంభమైన రెబల్ కౌన్సిలర్లు హాజరు కాలేదు.
ఉదయం 11 గంటలకే సమావేశ మందిరానికి జిల్లా కలెక్టర్ వెంకట్రావు( Collector Venkatarao ) చేరుకున్నారు.అయితే ఎవరూ రాకపోవడంతో సమావేశాన్ని మధ్యాహ్నాం 3 గంటలకు వాయిదా వేశారు.
ఈ క్రమంలోనే కౌన్సిలర్లు సమావేశానికి రావాలంటూ మైక్ ద్వారా ప్రకటించారు.రాత్రి వరకు 32 మంది కౌన్సిలర్లు మద్ధతుండగా తెల్లవారే సరికి రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి.
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ( Former Minister Jagdish Reddy )చక్రం తిప్పడంతో కౌన్సిలర్లు ఒక్కొక్కరిగా వెనక్కి తగ్గారని తెలుస్తోంది.దీంతో అవిశ్వాసానికి కావాల్సిన కోటా లేకపోవడంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలుస్తోంది.