విజయవాడలో వైసీపీ, జనసేన పార్టీల మధ్య ఫ్లెక్సీ వార్( YCP Janasena Flexi War ) ముదురుతోంది.పోటాపోటీగా వెలుస్తున్న ఫ్లెక్సీలతో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.ఎన్నికలకు సిద్ధం అంటూ వైసీపీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా.దానికి కౌంటర్ గా జనసేన మేము సిద్ధం అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటైంది.
ఈ క్రమంలో విజయవాడ( Vijayawada )లో వెలసిన జనసేన ఫ్లెక్సీని అర్థరాత్రి తరువాత తొలగించడంతో ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్నాయి.సమాచారం అందుకున్న విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ వాసు ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.తొలగించిన బ్యానర్ స్థానంలోనే మరో ప్లెక్సీని ఏర్పాటు చేశారు.అలాగే పోలీసులే కావాలని తమ ఫ్లెక్సీలను తొలగిస్తున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.