టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో ప్రభాస్( Hero Prabhas ) కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రభాస్ గెస్ట్ రోల్ లో నటించినా ఆ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగడం పక్కా అని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
ప్రభాస్ తర్వాత ఆ స్థాయి నటుడు ఎవరు అనే ప్రశ్నకు వేర్వేరు పేర్లు సమాధానంగా వినిపిస్తూ ఉంటాయి.తాజాగా నెక్స్ట్ ప్రభాస్ మీరేనంటూ కామెంట్స్ చేయడంతో యశ్( Yash ) ఈ విధంగా రియాక్ట్ అయ్యారు.
నన్ను ఇతర హీరోలతో దయచేసి పోల్చవద్దని యశ్ అన్నారు.నేను మొదట యశ్ మాత్రమేనని ఆయన కామెంట్లు చేశారు.ప్రభాస్ గొప్ప స్టార్ అని మంచి నటుడని ప్రతి ఒక్కరిలో వారికంటూ స్పెషల్ అట్రాక్షన్ ఉంటుందని నేను దానిని అభినందనగానే తీసుకుంటానని యశ్ తెలిపారు.మొదటినుంచి నాకు ఒకరితో పోల్చితే నచ్చదని అలా చేయకూడదని యశ్ అభిప్రాయపడ్డారు.
యశ్ కామెంట్లు కూడా కరెక్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్, యశ్ కాంబినేషన్ లో సినిమా కావాలని అభిమానులు కోరుకుంటుండగా ఈ కాంబినేషన్ రాబోయే రోజుల్లో సాధ్యమవుతుందేమో చూడాల్సి ఉంది.రాజమౌళి లేదా ప్రశాంత్ నీల్ కష్టపడితే మాత్రమే ఈ కాంబో వర్కౌట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.యశ్ కొత్త మూవీ టాక్సిక్( Toxic ) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
2025 సంవత్సరంలో టాక్సిక్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.టాక్సిక్ మూవీ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని ఈ సినిమాతో యశ్ కు భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కడం పక్కా అని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.