ప్రపంచంలోనే అతి పెద్ద రోటీ.. ఎందుకంత స్పెషలో తెలుసుకోండి!

రోటీ( Roti ) చూస్తే మీ కళ్ళు బైర్లు కమ్ముతాయి.ఎంత పెద్దదంటే ఈ ప్రపంచంలోనే అతి పెద్ద రోటీగా రికార్డులకెక్కింది.

 Worlds Largest Roti Made In Rajasthan Details, World, Big Roti, Viral Latest, Ne-TeluguStop.com

ఇక దీనిని తాజాగా రాజస్థాన్‌లోని( Rajasthan ) భిల్వారాలో తయారు చేయడం జరిగింది.ఈ రొట్టె తయారీ కోసం పిండిని కలిపి రొట్టెను చేసేందుకు సుమారు 2 గంటల సమయం పట్టినట్టు సమాచారం.

అలాగే చేసిన రోటీని కాల్చేందుకు 5 గంటల సమయం పట్టింది.ప్రపంచంలోనే అతిపెద్ద రోటీని తయారు చేసేందుకు వీరు గత రెండేళ్లుగా కృషి చేస్తున్నారు.

దేనికోసం వారు ఈ పెద్ద రొట్టెను తయారు చేశారో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

Telugu Kg, Kg Roti, Big Roti, Hariseva Dham, Rajasthan, Roti, Latest, Worlds Rot

అవును, సుమారు 207 కిలోల భారీ రొట్టెను( 270Kg Roti ) భిల్వారా పట్టణం హరిసేవా ధామ్‌లో తయారు చేశారు.మహామండలేశ్వర్‌ సంత్‌ హన్‌స్రామ్‌ ఆధ్వర్యంలో దీనిని తయారు చేయడం జరిగింది.ఉదయం రోటీ తయారీ పనులు మొదలు కాగా.

సాయంత్రానికి పూర్తయ్యింది.మొదట 22 మంది వ్యక్తులు కలిసి దీనికి సరిపడా పిండిని కలిపారు.

ఆ తర్వాత రోటీని తయారు చేసి, రొట్టెను పెనంపై వేసి తిప్పకుండా ఒకేవైపు కాల్చారు.ఈ రొట్టె తయారీ కోసం 120 కేజీల గోధుమ పిండి, 10 కేజీల మైదా, 10 కేజీల నెయ్యి, 67 లీటర్ల నీళ్లను వినియోగించారు.

రెండు గంటలకుపైగా శ్రమించి భారీ కర్ర సహాయంతో రొట్టెను చేశారు.

Telugu Kg, Kg Roti, Big Roti, Hariseva Dham, Rajasthan, Roti, Latest, Worlds Rot

ఆ తదుపరి వేద మంత్రోచ్ఛరణల మధ్య ఈ రోటీని కాల్చారు.దానికి ముందు భారీ రోటీని కాల్చేందుకు వెయ్యి ఇటుకలతో పొయ్యిని సిద్ధం చేశారు.800 కిలోల బొగ్గుతో పాటు పలు వస్తువులను సైతం వాడడం జరిగింది.సుమారు రోటీని కాల్చేందుకు 4 గంటల సమయం పట్టినట్టు నిర్వాహకులు తెలిపారు.ఆ తరువాత ఈ పెద్దదైన ఈ రోటీని రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ మిఠాయి తయారీదారులు తయారు చేసి.

అనంతరం హరిసేవా ధామ్‌కు( Hariseva Dham ) వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు.ఏముంది, కట్ చేస్తే రికార్డుల్లోకి ఎక్కింది ఈ రోటీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube