ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్( Lokesh Kanagaraj ) ఒకరు.ఈయన ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈయన తన తదుపరి చిత్రాన్ని హీరో విజయ్(Vijay ) తో చేశారు.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
విజయ్ హీరోగా తెరికెక్కిన లియో సినిమా ( Leo Movie ) దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.ట్రైలర్ కాస్త వివాదాలకు కారణమైనదని చెప్పాలి.ఇందులో ఒక సామాజిక వర్గానికి సంబంధించి కొన్ని డైలాగ్స్ విజయ్ చెప్పడంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదానికి కారణమయ్యాయి అయితే ఈ వివాదాస్పద వ్యాఖ్యల పై డైరెక్టర్ లోకేష్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ డైలాగ్స్ చెప్పడంలో విజయ్ తప్పు ఏమాత్రం లేదు ఆ బాధ్యత మొత్తం నాదేనని ఈయన తెలిపారు.ఈ డైలాగ్స్ రాసినప్పుడు విజయ్ చెప్పడానికి సందేహాలను కూడా వ్యక్తం చేశారని లోకేష్ తెలిపారు.

ఇలా ఆయన డైలాగ్స్ చెప్పే సమయంలో సందేహాలను వ్యక్తం చేయగా ఈ డైలాగ్స్ సన్నివేశానికి చాలా కీలకమని చెప్పి నేనే అతని చేత బలవంతంగా ఈ డైలాగ్స్ చెప్పించానని, అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వివాదానికి పూర్తిగా బాధ్యుని కూడా నేనేనని ఈయన తెలిపారు.ఇక ఈ డైలాగ్స్ విజయ్ చెప్పలేదని , లియో సినిమాలో పార్తిపన్ అనే పాత్ర చెప్పిన సంభాషణ మాత్రమేనని ఈ సందర్భంగా లోకేష్ క్లారిటీ ఇచ్చారు.ఇక ఈ సినిమాలో విజయ్ సరసన నటి త్రిష ( Trisha ) అలాగే ప్రియా ఆనంద్( Priya Anand ) హీరోయిన్లగా నటించారు.మరి ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.







