ఈ మధ్య కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులోపడి కట్టుకున్న వారిని సైతం మోసం చేయడం మరియు కడుపున పుట్టిన వారిని సైతం హతమార్చడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు.తాజాగా ఓ వివాహిత తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని తన సోదరుడని చెబుతూ భర్తకి పరిచయం చేసి ఇంట్లో ఉంటూనే వివాహేతర సంబంధం కొనసాగిస్తూ చివరికి తన ప్రియుడి చేతిలో దారుణంగా హత మార్చబడిన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని మీరట్ పరిసర ప్రాంతంలో జుబేదా అనే వివాహిత తన భర్త పిల్లలతో కలిసి నివాసం ఉంటుంది.అయితే జుబేదా భర్త కుటుంబ పోషణ నిమిత్తం స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేటు సంస్థలో మార్కెటింగ్ విభాగంలో పని చేస్తున్నాడు.
దీంతో ఎక్కువగా బయట ప్రాంతాలలో సంచరిస్తూ ఉదయం వెళితే రాత్రికి ఎప్పుడో ఇంటికి వచ్చేవాడు.దీంతో జుబేదా ఒంటరి తనం ఫీల్ అయ్యేది.సరిగ్గా ఈ సమయంలోనే స్థానికంగా ఉన్నటువంటి సమీర్ అనే వ్యక్తితో జుబేదా కి పరిచయం ఏర్పడింది.ఈ క్రమంలో ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.
దీంతో జుబేదా తన ప్రియుడిని ఏకంగా ఇంటికి పిలిపించుకుని తన చట్టం మరియు సోదరుడు అవుతాడని తన భర్త కి ప్రయాణం చేస్తూ ఇంట్లోనే పెట్టుకుంది.దాంతో కూడా అన్నాచెల్లెళ్ల బంధం కావడంతో అడ్డుచెప్పలేదు.
కానీ క్రమక్రమంగా వీరిద్దరి వ్యవహారంపై స్థానికులు మరియు ఇతర బంధువులు ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు.
దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని సమీర్ తో జుబేదా భర్త గొడవ పడ్డాడు.
ఈ గొడవలో తీవ్ర ఆగ్రహానికి గురైన సమీర్ చేతికందిన కత్తితో జుబేదా ని మరియు ఆమె భర్త ని దారుణంగా హతమార్చాడు.అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆస్పత్రికి తరలించిన అప్పటికీ ఫలితం లేకపోయింది దీంతో ఈ విషయాన్ని చూసినటువంటి జుబేదా పిల్లలు పోలీసులకు జరిగిన విషయం గురించి క్షుణ్ణంగా తెలియజేశారు.దాంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు సమీర్ ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.