హెల్మెట్ పెట్టుకున్నంత మాత్రాన ప్రమాదాలు జరగకుండా ఆగుతాయా ముందు రోడ్లు గుంతలు పూడ్చండి.వాహనం నడపాలంటే భయమేస్తూంది.
అని భీమవరంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ను ఓ మహిళ నిలదీసింది పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో టూటౌన్ సీఐ కృష్ణ కుమార్ తమ సిబ్బందితో బివి రాజు మార్క్ వద్ద హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాం ను నిర్వహిస్తుండగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాలని ఆపి
హెల్మెట్ యొక్క ఉపయోగం వివరిస్తుండగా ఆ మహిళ ప్రయాణికురాలు సర్కిల్ ఇన్స్పెక్టర్ తో వాగ్వివాదానికి దిగారు ఏ సెక్షన్ ప్రకారం హెల్మెట్ ధరించాలని ఏ సెక్షన్ లో ఉందో నాకు వివరించాలని, నా సేఫ్టీ నాకు తెలుసు అని ఆ మహొళ CI ని ప్రశ్నింది ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే హెల్మెట్ ఒకటే కాదు ముందు రోడ్లు నిర్మించాలన్నారు ఆ మహిళ.