టీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలు, అన్యాయాలను అసెంబ్లీలో లేవనెత్తిన బిజేపి నేతలను అసెంబ్లీలోనికి అడుగు పెట్టకుండా కుట్రపూరితంగా వ్యవహారించటం దుర్మార్గ చర్యయని బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు పటాన్ చెరువు నియోజకవర్గంలోని గుమ్మడి దల మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో బీజేపీ బహిరంగ సభ జరిగింది హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో పలు పార్టీల నేతలు, కార్యకర్తలు.బీజేపీలో చేరారు.
ఈ సందర్భము గా బహిరంగ సభలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ-టీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామ గ్రామాన మెడికల్ షాపులు ఉండవు కాని బెల్ట్ షాపులు మాత్రం ఉంటాయని ఎద్దేవా చేసారు ఏటా 42వేల కోట్లు కేవలం ఒక్క మధ్యంతోనే ప్రభుత్వం సంపాదిస్తుందన్నారు పెన్షన్లు, రైతుబంధు, షాదీ ముంబాయ్ వంటి పధకాలు ప్రజల పైసలతోనే ఇస్తున్నారు.వాటిని మళ్లీ ప్రజలపైనే భారము పడుతుందన్నారు.
రైతుబంధుతో రియల్ వ్యాపారులకూ, ధనవంతులకు, భూస్వాములకు మాత్రమే లబ్ధి చేకూర్చింది.
కౌలు దారులు నష్టపోయారన్నారు సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం విడ్డూరమని దళితులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం మాత్రమేనని చెప్పారు ధరణితో 15లక్షల ఎకరాల భూమిని పేదల నుంచి,కొనుగోలుదారుల నుంచి కొల్లగొట్టిన ఘనత టీఆర్ఎస్ దేనని దుయ్యబట్టారు దళితులకు మూడెకరాల భూమి ఇస్తొనని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ అసైన్డ్ భూములను కూడా గుంజుకున్నాడని అన్నారు రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఉన్న లక్షల ఎకరాలను ల్యాండ్ పుల్లింగ్ పేరుతో గుంజుకున్న టీఆర్ఎస్ పార్టీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందన్నారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.