Jp-ycp:జేపి వయా వైసీపి.. జగన్ కు ఏమైనా కలిసి వస్తుందా..?

ఈ మధ్యకాలంలో లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ( Jayaprakash narayan ) గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి.ఆయన పార్టీ మారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 Will Anything Come Together For Jagan Via Jp Or Ycp-TeluguStop.com

దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రస్తుత రాజకీయ నాయకుల్లో మేధావి రంగంలో జేపీ నారాయణ ముందు వరుసలో ఉంటారు.

ఆయన ఏ విషయాన్ని మాట్లాడినా చాలా విశ్లేష పూర్వకంగా, ప్రజలకు అర్థమయ్యే విధంగా అందులోని తప్పొప్పులను తెలియజేస్తూ మాట్లాడే ఘనుడు.లోక్ సత్తా పార్టీ ( Lok sattha)పెట్టి తన సత్తా ఏంటో చూపిద్దామనుకున్నాడు.

Telugu Ap, Chandra Babu, Cm Jagan, Jayaprakash Yan-Politics

కానీ అనుకున్నది నెరవేరక సతమతమవుతున్నాడు.ఆయన ఎప్పుడూ ఏ పార్టీని, ఏ నాయకున్ని ఏ విధంగా విమర్శిస్తారో అసలు అర్థం చేసుకోలేం.ఏది మాట్లాడినా చాలా అర్థవంతంగా మాట్లాడుతాడు అని చెప్పవచ్చు.అలాంటి జేపీ ఈ మధ్యకాలంలో జగన్ కు( CM Jagan ) దగ్గరగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్యకాలంలో ఆయనతో జయప్రకాశ్ నారాయణ భేటీ అయినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం.జయప్రకాష్ నారాయణ అంతకుముందు చంద్రబాబుకు( chandrababu naidu) కాస్త పాజిటివ్ గా సపోర్ట్ చేసేవారు.జగన్ ను ఏకీపారేసేవారు.

కానీ ఈ మధ్యకాలంలో జగన్ సర్కారుకు ఆయన కాస్త దగ్గరవుతున్నారు.అంతేకాకుండా ఈ మధ్య జరిగిన ఆప్కాబ్ మీటింగ్ లో జగన్ మరియు జేపీ పక్క పక్కన కూర్చొని చాలా విషయాలు డిస్కస్ చేశారని, త్వరలో జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా పార్టీని వైసీపీలో విలీనం చేయనున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి.

Telugu Ap, Chandra Babu, Cm Jagan, Jayaprakash Yan-Politics

ఒకవేళ పూర్తిస్థాయిలో కల్పకపోయిన వైసీపీకి( ycp ) సపోర్టు ఇచ్చి ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.ఒకవేళ జేపీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తే మాత్రం జగన్ కు రాబోవు ఎన్నికల్లో చాలా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.ఆయనలాంటి మేధావులు పార్టీలో ఉంటే జగన్ తన రాజకీయ వ్యూహాలు మరింత పెంచి ప్రజలకు పాలనందించే అవకాశం కనిపిస్తోంది.అంతేకాకుండా జేపీ వల్ల కాస్త ఓట్ల ప్రభావం కూడా జగన్ కు పెరిగి రాబోవు ఎన్నికల్లో గెలుపు తీరాలకు తీసుకెళ్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube