ఈ మధ్యకాలంలో కొందరు చిన్న చిన్న విషయాలకు వారి ప్రాణాలను తీసుకోవడం పరిపాటిగా మారిపోయింది.వారిని నమ్ముకుని ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని పట్టించుకోకుండా వారు క్షణికావేశంలో చివరికి ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడటం లేదు.
అమ్మ కొట్టిందనో, నాన్న తిట్టాడనో… లేకపోతే ఏదో చిన్న కారణాలతోనే ఈమధ్య ఎందరో ప్రాణాలు తీసుకోవడం లాంటి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం.అసలు విషయం లోకి వెళితే.
తాజాగా ఇలాంటి దారుణం హైదరాబాద్ మహానగరంలో ఉన్న జీడిమెట్ల ప్రాంతంలో జరిగింది.
తన భార్య చాక్ పీస్ లు ఎక్కువ తింటుందన్న నేపథ్యంలో అనారోగ్యం పాలవుతుందన్న కారణంతో ఆమెను చాక్ పీస్ లు తినొద్దు అని భర్త మందలించడంతో ఆమె చివరికి ఇంట్లో ఉన్న ఫ్యాన్ కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తుఫాన్ యాదవ్, సంజు యాదవ్ లకు కొన్ని సంవత్సరాల కిందట వివాహం జరగగా వారు ఓ సంవత్సరం క్రితం హైదరాబాదు నగరానికి బతుకుదెరువు కోసం వచ్చారు.
ఇదే క్రమంలో జీడిమెట్ల ప్రాంతంలో సంజు యాదవ్ ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఇకపోతే సంజయ్ యాదవ్ భార్య తుఫాన్ యాదవ్ కు చాలా కాలం నుండి సుద్ద ముక్కలు తినడం అలవాటు ఉండేది.
అయితే అవి తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆమెకు తన భర్త చెప్పిన తాను వినిపించుకోకుండా అలవాటును మానుకోలేకపోయింది.భర్త మందలిస్తాడన్న నేపథ్యంలో భర్తకు తెలియకుండా సుద్ద ముక్కలు తీసుకుని వచ్చి అతను లేనప్పుడు వాటిని తింటూ ఉండేది.
ఇదే క్రమంలో తాజాగా భర్త కంట సుద్ద ముక్కలు కనపడడంతో మరోసారి భార్యని మందలించాడు.అలా మందలించిన తర్వాత ఇంట్లో ఉన్న సుద్ద ముక్కలను బయట పడేసి వస్తానని వెళ్ళిన భర్త తిరిగి వచ్చే సమయానికి భార్య క్షణికావేశంలో ఇంట్లో ఉన్న ఫ్యాన్ కు ఉరి వేసుకుని తనువు చాలించింది.
దీంతో ఆ విషయాన్ని భర్త చుట్టుపక్కల వారికి తెలిపాడు.చివరికి విషయాన్ని పోలీసులకు అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.